...
...
Next Story

Kangana Kriti Rakhi: అన్నకు రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏంటీ? కృతి సనన్‌పై కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్

Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషంపై తాజాగా కృతి సనన్‌పై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్ చేశారు. బికినీలో అన్నకు రాఖీ కట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు.

Published on: Aug 24, 2026, 22:26:49 IST
Advertisement

Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చేసిన ఒక యాడ్ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. సాంప్రదాయ పండుగ వాతావరణంలో సాగే ఈ యాడ్‌లో ఇండో-వెస్ట్రన్ తరహా బోల్డ్ దుస్తులు ధరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రవర్సీ హీరోయిన్ ఘాటు కామెంట్స్

అన్నకు రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏంటీ? కృతి సనన్‌పై కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్
అన్నకు రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏంటీ? కృతి సనన్‌పై కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్

పండుగ సంస్కృతికి తగినట్లుగా కాకుండా ఇలాంటి దుస్తులు ఎంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కాంట్రవర్సీ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ కృతి సనన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయంపై సుదీర్ఘ పోస్ట్ చేశారు.

"లోదుస్తుల్లో అన్నకు రాఖీ కడతారా?" - కంగనా ప్రశ్న

"ఈ రోజుల్లో మహిళల దుస్తుల ఎంపికకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కాక్‌టెయిల్ డ్రెస్సుల నుంచి లెహంగాలు, జీన్స్ నుంచి చీరల వరకు ఎన్నో అందుబాటులో ఉన్నప్పుడు, సొంత సోదరుడికి రాఖీ కట్టేందుకు బికినీ లేదా లోదుస్తులు (అండర్‌గార్మెంట్స్) వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీ స్టైలింగ్ ఆప్షన్స్ ఏమయ్యాయి? ఈ ప్రకటన కావాలనే అసభ్యకరంగా తీసినట్లుంది" అని కంగనా రనౌత్ కూడా బోల్డ్‌గా ఎద్దేవా చేశారు.

నెటిజన్ల నుంచి విమర్శల వర్షం

ఈ ప్రకటనలో కృతి సనన్ ధరించిన దుస్తులపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. "ఇందులో పూజ థాలి ఎక్కడ ఉంది? సోదరుడి ముందు ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఏమిటి? ఇది రక్షా బంధన్ పండుగలా అనిపిస్తుందా?" అని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

కృతి సనన్‌పై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

వివాదం సృష్టించేందుకేనంటూ

ఇదిలా ఉంటే, కృతి సనన్ వరుస సినిమాలతో బాలీవుడ్‌లో మంచి జోరు చూపిస్తోంది. ఇటీవలే షాహిద్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు హోమి అదాజానియా దర్శకత్వం వహించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 14న కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, మరోవైపు కంగనా రనౌత్ కూడా ఇటీవల 'భారత భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) సినిమాలో నటించారు.

నర్సుల ధైర్యసాహసాలతో భారత్ భాగ్య విధాత

26/11 ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆస్పత్రి సిబ్బంది, నర్సుల ధైర్యసాహసాలను చూపించారు. భారత్ భాగ్య విధాత కూడా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. జీ5 (Zee5)లో భారత భాగ్య విధాత ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe