Karthika Deepam 2 Serial Actor Nirupam Paritala Multi Talents: తెలుగు బుల్లితెరపై సంచలన విజయంతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. ఇది నవ వసంతం అంటూ కార్తీక దీపం సీజన్ 2గా ప్రారంభమైన ఈ సీరియల్ ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
ట్విస్టులు, నటనతో హైలెట్

ప్రస్తుతం అయితే సూరజ్, మాలిని దెబ్బతో శివ నారాయణ కుటుంబం రోడ్డు మీదకు వచ్చేస్తుంది. హీరో కార్తీక్ పెద్ద డ్రామా చేసి మొత్తానికి తాత కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. కార్తీక దీపం 2 సక్సెస్ అవడానికి సీరియల్‌లో వచ్చే ట్విస్టులతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించే నటీనటులు.
ఇక హీరోగా నిరుపమ్ పరిటాల కార్తీక్ పాత్రకు పర్‌ఫెక్ట్ యాప్ట్ అని ఎన్నోసార్లు అనిపించుకున్నాడు. ఇదివరకు కార్తీక దీపం సీరియల్‌లో కూడా డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర సీరియల్స్‌లో కూడా హీరోగా చేస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
విలన్‌గా హీరో నిరుపమ్
ఇలా బుల్లితెరపై స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల సినిమాలో మాత్రం విలన్‌గా కనిపించాడు. అయితే, మొదట విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక దీపం 2 హీరో నిరుపమ్ పరిటాల జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, నిత్య మీనన్ వంటి స్టార్లతో నటించాడు.
ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ కొడుకుగా బుల్లితెరపైకి అడుగుపెట్టిన నిరుపమ్ పరిటాల 2006లో ఈటీవీలోని చంద్రముఖి సీరియల్‌తో డెబ్యూట్ చేశాడు. ఆ తర్వాత జెమినీ టీవీలో బ్రహ్మముడి, మావి చిగురు, కలియుగ రామాయణం, జీ తెలుగులో కన్యాదానం, కలవారి కోడళ్లు, మూగమనసులు, గృహప్రవేశం, హిట్లర్ గారి పెళ్లాం, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ చేశాడు నిరుపమ్.
16 సీరియల్స్, 6 టీవీ షోలు
{{/usCountry}}ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ కొడుకుగా బుల్లితెరపైకి అడుగుపెట్టిన నిరుపమ్ పరిటాల 2006లో ఈటీవీలోని చంద్రముఖి సీరియల్‌తో డెబ్యూట్ చేశాడు. ఆ తర్వాత జెమినీ టీవీలో బ్రహ్మముడి, మావి చిగురు, కలియుగ రామాయణం, జీ తెలుగులో కన్యాదానం, కలవారి కోడళ్లు, మూగమనసులు, గృహప్రవేశం, హిట్లర్ గారి పెళ్లాం, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ చేశాడు నిరుపమ్.
16 సీరియల్స్, 6 టీవీ షోలు
{{/usCountry}}ఇలా మొత్తంగా 16 సీరియల్స్, ఆరు టీవీ షోలలో తెలుగు రాష్ట్రాల బుల్లితెర ఆడియెన్స్ మనసు గెలుచుకున్నాడు. ఇక 2009లో అల్లరి నరేష్ హీరోగా చేసిన ఫిట్టింగ్ మాస్టర్ సినిమాలో విలన్‌గా చేశాడు నిరుపమ్. అల్లరి నరేష్ చెల్లెలిని ప్రేమించి, పెళ్లి చేసుకుని, మోసం చేసే ప్రియుడిగా నిరుపమ్ పరిటాల చేశాడు.
ఆ తర్వాత 2014లో జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత సుభాష్ హీరో హీరోయిన్లుగా చేసిన రభస సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించాడు ఈ కార్తీక దీపం 2 హీరో. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా నటించాడు. నిరుపమ్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లికోసం తారక్ తీసుకెళ్లే సీన్‌తోనే రభస స్టార్ట్ అవుతుంది.
మాటల రచయితగా-ఓటీటీ ఎంట్రీ
ఇలా నటుడిగానే కాకుండా 2017లో వచ్చిన నెక్ట్స్ నువ్వే సినిమాకు మాటలు కూడా రాసి రచయిత అనిపించుకున్నాడు నిరుపమ్ పరిటాల. ఇందులో ఆది సాయి కుమార్ హీరోగా, వైభవి శాందిల్య, రష్మీ గౌతమ్ హీరోయిన్లుగా చేశారు. ఇక వెండితెరపైనే కాకుండా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు నిరుపమ్ పరిటాల.
2023లో వచ్చిన కుమారి శ్రీమతి ఓటీటీ సిరీస్‌లో నిత్యా మీనన్ సరసన నిరుపమ్ పరిటాల నటించాడు. ఇందులో నిత్యా మీనన్‌ను ప్రేమించే యువకుడిగా, తన నిర్ణయాలను, ఆలోచనలు సపోర్ట్ చేసే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కుమారి శ్రీమతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
నిర్మాతగా రాణిస్తున్న నిరుపమ్
ఇదే కాకుండా ఇటీవల బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీలో స్పెషల్ ఆఫీసర్ రోల్ పోషించాడు నిరుపమ్ పరిటాల. ఇలా నటుడిగా, రచయితగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు నిరుపమ్.
స్టార్ మాలో పాపులర్ సీరియల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పొదరిల్లుకు నిరుపమ్ పరిటాలే నిర్మాత. ఈ సీరియల్ కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు వంటి సీరియల్స్‌తో పోటీ పడుతూ మరి రేటింగ్ తెచ్చుకోవడం విశేషం.