...
...
Next Story

Ramayana Trailer: రాముడిగా మహేశ్ బాబు, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా కీర్తి సురేష్- రామాయణం కొత్త ట్రైలర్ అదుర్స్!

Mahesh Babu Jr NTR Ramayana Trailer: నితీష్ తివారీ ప్రతిష్టాత్మక మూవీ రామాయణం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తెలుగు స్టార్ హీరోలతో కూడిన న్యూ ట్రైలర్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. రాముడిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Published on: Jul 12, 2026, 21:37:18 IST
Advertisement

Mahesh Babu Jr NTR Ramayana Trailer: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం: పార్ట్ 1' చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ జూలై 24న విడుదల కానుంది.

రామాయణం కొత్త ట్రైలర్

రాముడిగా మహేశ్ బాబు, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా కీర్తి సురేష్- రామాయణం కొత్త ట్రైలర్ అదుర్స్! (Pic credit: Sanatani Siddhanta)
రాముడిగా మహేశ్ బాబు, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా కీర్తి సురేష్- రామాయణం కొత్త ట్రైలర్ అదుర్స్! (Pic credit: Sanatani Siddhanta)

ఈ లోపే సోషల్ మీడియాలో ఒక వినూత్న ప్రయోగం సంచలనం సృష్టిస్తోంది. అసలు రామాయణ ట్రైలర్ కోసం ఆగలేకపోయిన టాలీవుడ్ అభిమానులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తెలుగు స్టార్ హీరోలను పెట్టి ఒక కొత్త అద్భుతమైన ఫ్యాన్ మేడ్ రామాయణ ట్రైలర్‌ను రూపొందించారు.

రాముడిగా మహేశ్.. రావణుడిగా ఎన్టీఆర్!

'సనాతని సిద్ధాంత' అనే యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఈ రామాయణ ఏఐ ట్రైలర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రాముడి పాత్రలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సీతగా కీర్తి సురేష్, లంకేశ్వరుడు రావణాసురుడిగా జూనియర్ ఎన్టీఆర్, మండోదరిగా జాన్వీ కపూర్ కనిపించారు. కేవలం 1 నిమిషం 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్‌లా సాగింది.

ఈ రామాయణ ట్రైలర్‌లో సీతాదేవి అపహరణ తర్వాత రాముడి పాత్రలో మహేశ్ బాబు పండించిన ఎమోషన్స్, ఆయన కోసం కీర్తి సురేష్ పడే వేదన ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. వీటన్నింటికీ మించి, పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం రావణుడి పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన చేతికే నిప్పు పెట్టుకుని తపస్సు చేసే సీన్ పూనకాలు తెప్పించేలా ఉంది. మండోదరిగా జాన్వీ కపూర్ హావభావాలు కూడా ఆకట్టుకున్నాయి.

గూస్‌బంప్స్ వస్తే ఎవడ్రా రెస్పాన్సిబుల్?

మరో నెటిజన్ సరదాగా స్పందిస్తూ.. "ఈ వీడియో చేసినవాడికి ఒక పదివేలు ఇచ్చి యూట్యూబ్‌లో పూర్తి స్థాయి రెండు గంటల సినిమా రిలీజ్ చేయమను" అంటూ కామెంట్ చేశారు. ఈ రేంజ్‌లో టాలీవుడ్ స్టార్స్‌తో పౌరాణిక చిత్రం వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.

అసలు 'రామాయణం' అప్‌డేట్స్ ఇవీ..

రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న అధికారిక 'రామాయణం' సినిమాను నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మెర్, భారతీయ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఈ పౌరాణిక గాథను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

మొదటి భాగం 2026 దీపావళి కానుకగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అధికారిక రామాయణ ట్రైలర్‌ను జూలై 23న శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా ప్రదర్శించి, జూలై 24న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మహేశ్, ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్టులు

ప్రస్తుతం ఈ ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు తమ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. 'గుంటూరు కారం' తర్వాత మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డ్రాగన్ షూటింగ్‌లో

మరోవైపు 'దేవర: |పార్ట్ 1', 'వార్ 2' చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లార్డ్ మురుగన్ నేపథ్యంతో రానున్న సరికొత్త ప్రాజెక్టుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe