...
...
Next Story

Manchu Manoj Dada NBK111: నేను బాలయ్య అన్నయ్య కలిసి దాదాతో వస్తున్నాం.. స్టేజ్ మీద అధికారికంగా కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్

Manchu Manoj Confirms His Role In Balakrishna Dada: నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న క్రేజీ సినిమా దాదాలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు తాజాగా అధికారింగా రాకింగ్ స్టార్ కన్ఫర్మ్ చేశాడు. రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ నటించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 17, 2026, 19:57:04 IST
Advertisement

Manchu Manoj Confirms His Role In Balakrishna Dada: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగానే విలన్‌గా కూడా అట్రాక్ట్ చేశాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ అందరిని ఆకట్టుకున్నాడు.

బాలకృష్ణతో మంచు మనోజ్ ఢీ

నేను బాలయ్య అన్నయ్య కలిసి దాదాతో వస్తున్నాం.. స్టేజ్ మీద అధికారికంగా కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్
నేను బాలయ్య అన్నయ్య కలిసి దాదాతో వస్తున్నాం.. స్టేజ్ మీద అధికారికంగా కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్

అలాగే భైరవం సినిమాలో కూడా గ్రే షేడ్స్‌లో అలరించాడు మంచు మనోజ్. అలాంటి మంచు మనోజ్ నందమూరి నటసింహం బాలకృష్ణతో ఢీకొట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు హీరో కార్తీ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్‌లో బాలకృష్ణ సినిమాలో చేస్తున్నట్లు మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.

అయితే, అదేం మూవీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం అది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దాదా సినిమానే అని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్స్‌ నిజమేనంటూ తాజాగా మంచు మనోజ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేశాడు.

ఆస్మాన్ టీజర్ లాంచ్‌లో

రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆస్మాన్. తాజాగా ఆస్మాన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మంచు మనోజ్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఓ సందర్భంలో దాదా సినిమాపై అప్డేట్ ఇచ్చారు మంచు మనోజ్.

ఇకపోతే దాదా సినిమాలో బాలకృష్ణకు పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ నటించనున్నట్లు సమాచారం. ఇదివరకు మంచు మనోజ్, బాలకృష్ణ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మరోసారి ఈ ఇద్దరి కాంబో రిపీట్ కానుంది.

కానీ, ఈసారి ఇద్దరు హీరో విలన్‌గా ఢీ కొట్టనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ షేక్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, మరోవైపు దాదా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. వీరసింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

దాదా గ్లింప్స్‌తో భారీ అంచనాలు

ఇటీవల దాదా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేసి మూవీపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ గ్లింప్స్‌లో వింటేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో బాలకృష్ణ కనిపించిన తీరు, ఆయన నోటి నుంచి వచ్చిన పవర్ ఫుల్ డైలాగులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

గ్లింప్స్ ప్రారంభంలోనే ముంబై కోస్ట్‌లైన్ విజువల్స్‌తో పాటు హిందీ వాయిస్‌ ఓవర్‌తో హీరో బాలకృష్ణను పరిచయం చేశారు. చేతిలో సిగార్, లేత రంగు లెదర్ జాకెట్, వైట్ సన్‌గ్లాసెస్‌తో బాలకృష్ణ రెట్రో లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

కింగ్ ఆఫ్ కేయాస్ అంటూ

దాదా సినిమా కథ మొత్తం 1980ల నాటి ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. బాలకృష్ణ క్యారెక్టర్‌ను "కింగ్ ఆఫ్ కేయాస్" (అల్లకల్లోలానికి రాజు) అని సంబోధించడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

బ్యాక్‌గ్రౌండ్‌లో 'దాదాసాహెబ్' అంటూ తమన్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్ చూస్తుంటే గోపీచంద్ మలినేని బాలయ్య అభిమానుల కోసం పక్కా మాస్ విందు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దాదా నటీనటులు

ఇక ఈ దాదా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, శరత్‌ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా దాదా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks