Must Watch OTT Movies With Friends This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్ అందరూ ఒక్కచోట చేరి కబుర్లు చెప్పుకోవడం, సరదాగా గడపడం మన దగ్గర సాధారణ విషయం. అలాంటి సమయాల్లో మంచి కామెడీ సినిమా తోడైతే ఆ మజానే వేరు. స్నేహం నేపథ్యంలో వచ్చే రోడ్‌ట్రిప్‌లు, కాలేజీ జ్ఞాపకాలు, చిలిపి గొడవలు ఎప్పుడూ బోర్ కొట్టవు.
నవ్వుకోవడానికి ఓటీటీలో

మీరు కూడా మీ గ్యాంగ్‌తో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ ఐదు అద్భుతమైన బడ్డీ కామెడీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ఓటీటీ సినిమాల జాబితా మీకోసం.
జిందగీ నా మిలేగీ దొబారా: యూరప్ అందాలు.. ముగ్గురు మిత్రుల ప్రయాణం
స్నేహితుల సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకువచ్చే చిత్రం 'జిందగీ నా మిలేగీ దొబారా'. 2011లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ముగ్గురు బాల్య మిత్రులు కలిసి స్పెయిన్‌కు బ్యాచిలర్ ట్రిప్ వెళ్లడం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు వారి జీవితాలను ఎలా మార్చాయో దర్శకురాలు జోయా అక్తర్ అద్భుతంగా తెరకెక్కించారు. స్కై డైవింగ్, డీప్ సీ డైవింగ్, ప్రసిద్ధ లా టొమాటినా ఫెస్టివల్ సన్నివేశాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ తమ పాత మిత్రులను గుర్తు చేసుకునేలా చేస్తుంది.
మడ్గావ్ ఎక్స్‌ప్రెస్: గోవా ట్రిప్ హంగామా
చిన్నప్పటి నుంచి గోవా వెళ్లాలని కలలు కనే ముగ్గురు స్నేహితులు.. పెద్దయ్యాక ఎలాగోలా ఆ కల నెరవేర్చుకుంటారు. తీరా అక్కడికి వెళ్లాక డ్రగ్ మాఫియా చిక్కుల్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే కథాంశంతో నటుడు కునాల్ ఖేము దర్శకత్వం వహించిన ఓటీటీ క్రైమ్ కామెడీ చిత్రం 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్'.
{{/usCountry}}చిన్నప్పటి నుంచి గోవా వెళ్లాలని కలలు కనే ముగ్గురు స్నేహితులు.. పెద్దయ్యాక ఎలాగోలా ఆ కల నెరవేర్చుకుంటారు. తీరా అక్కడికి వెళ్లాక డ్రగ్ మాఫియా చిక్కుల్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే కథాంశంతో నటుడు కునాల్ ఖేము దర్శకత్వం వహించిన ఓటీటీ క్రైమ్ కామెడీ చిత్రం 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్'.
{{/usCountry}}దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. గ్యాంగ్‌స్టర్లు, మారణాయుధాలు, పొరపాట్ల వల్ల జరిగే రచ్చతో సాగే ఈ పూర్తిస్థాయి కామెడీ డ్రామా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఛిఛోరే: నోస్టాల్జిక్ కాలేజీ జ్ఞాపకాలు
కాలేజీ రోజుల నాటి మధుర స్మృతులను, హాస్టల్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం 'ఛిఛోరే'. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కాలేజీ రోజుల్లో విడిపోయిన మిత్రులు ఓ క్లిష్ట పరిస్థితిలో మళ్లీ ఎలా ఏకమయ్యారనేది ఇందులో చూడవచ్చు. నవ్వులతో పాటు చక్కని ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ రిలీజ్ అయింది.
ధమాల్: నాన్‌స్టాప్ నవ్వుల పండగ
ఏమాత్రం లాజిక్ ఆలోచించకుండా కేవలం నవ్వుకోవడమే ధ్యేయంగా సినిమా చూడాలనుకుంటే 'ధమాల్' సరైన ఎంపిక. నిధి వేటలో పడ్డ నలుగురు మిత్రులు చేసే మూర్ఖపు పనులు, కొనితెచ్చుకునే చిక్కులు విపరీతమైన వినోదాన్ని పంచుతాయి. సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ నటించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 2 ఓటీటీల్లో చూడవచ్చు.
ది హ్యాంగోవర్ ఓటీటీ
ఇక హాలీవుడ్ క్లాసిక్ బడ్డీ కామెడీ 'ది హ్యాంగోవర్' గురించి ఎంత చెప్పినా తక్కువే. లాస్ వెగాస్‌కు బ్యాచిలర్ పార్టీకి వెళ్లిన నలుగురు మిత్రులు రాత్రి ఏం జరిగిందో మరచిపోవడం, తప్పిపోయిన తమ స్నేహితుడిని వెతికే క్రమంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు మైండ్ బ్లాక్ చేస్తాయి. బ్రాడ్లీ కూపర్, ఎడ్ హెల్మ్స్ నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లలో ది హ్యాంగోవర్ ఓటీటీ రిలీజ్ అయింది.
స్నేహం విలువను, పాత జ్ఞాపకాలతో
ఈ ఐదు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, స్నేహం విలువను, పాత జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఈ ఓటీటీ చిత్రాలను చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయండి!