...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి నిన్న రిలీజైన నాగబంధం, రావు బహదూర్- రెండూ డిఫరెంట్- ఒకేరోజూ ఓటీటీ స్ట్రీమింగ్- ఎక్కడెక్కడంటే?

Nagabandham Rao Bahadur OTT Streaming: నిన్న (జూలై 3) థియేటర్లలో విడుదలైన రెండు డిఫరెంట్ సినిమాలు నాగబంధం, రావు బహదూర్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. విడుదలైనట్లుగానే ఒకేరోజు ఈ 2 సినిమాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాని సమాచారం. మరి వాటి ఓటీటీ రిలీజ్ ఎక్కడో లుక్కేద్దాం.

Published on: Jul 4, 2026, 14:40:45 IST
Advertisement

Nagabandham Rao Bahadur OTT Release: ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలా రిలీజ్ కాగానే వాటి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగానే రెండు తెలుగు సినిమాల ఓటీటీ డీటేల్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

విడుదలైనట్లుగానే ఒకేరోజు ఓటీటీలోకి

ఓటీటీలోకి నిన్న రిలీజైన నాగబంధం, రావు బహదూర్- రెండూ డిఫరెంట్- ఒకేరోజూ ఓటీటీ స్ట్రీమింగ్- ఎక్కడెక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన నాగబంధం, రావు బహదూర్- రెండూ డిఫరెంట్- ఒకేరోజూ ఓటీటీ స్ట్రీమింగ్- ఎక్కడెక్కడంటే?

ఆ రెండు సినిమాలే నాగబంధం, రావు బహదూర్. రెండు డిఫరెంట్ జోనర్లలో నిన్న ఒక్కరోజే రిలీజ్ అయిన నాగబంధం, రావు బహదూర్ ఒకేరోజునే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరి ఎక్కడెక్కడ ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగులో తెరకెక్కిన సోషియో ఫాటంసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం నాగబంధం. పెదకాపుతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ, బ్యూటిఫుల్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు.

నాగబంధం ఓటీటీ డీల్

మైథాలాజీ, అదిరిపోయే విజువల్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మరో హీరోయిన్లు దక్ష నగర్కర్, ఐశ్వర్య మీనన్‌తోపాటు అనసూయ భరద్వాజ్, జగపతి బాబు, మురళీ శర్మ, రిషభ్ సావ్నీ, మహేష్ మంజ్రేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

జూలై 3న థియేటర్లలోకి వచ్చిన నాగబంధం సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న విజువల్స్ మాత్రం అదిరిపోయాయని టాక్ వస్తోంది. దాదాపుగా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఖర్చు తెరపై కనిపిస్తుందని రివ్యూలు వచ్చాయి. ఇలాంటి నాగబంధం ఓటీటీ డీల్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే జరిగిపోయింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి

అంతేకాకుండా ఈ నెల అంటే జూలై 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి నాగబంధం వచ్చేయనుందని టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక నాగబంధం శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఓటీటీ రిలీజ్ అనంతరం జీ తెలుగులో నాగబంధం టీవీ ప్రీమియర్ అవనుంది.

సత్యదేవ్ రావు బహదూర్

డిఫరెంట్ పాత్రలతో దూసుకుపోతున్న హీరో సత్యదేవ్ నటించిన క్రేజీయెస్ట్ మూవీ రావు బహదూర్. కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా ఇది. నిన్న విడుదలైన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని కొనియాడుతున్నారు. అయితే, రావు బహదూర్ సినిమా కొంత ల్యాగ్ అనిపించిన ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయాయని, ఊహకందని ట్విస్టుతో షాక్ ఇచ్చారని రివ్యూవర్స్ చెబుతున్నారు. అలాంటి రావు బహదూర్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో రావు బహదూర్ ఓటీటీ రిలీజ్ కానుంది. నాగబంధం లాగే జూలై 31 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో రావు బహదూర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని టాక్. అలాగే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో రావు బహదూర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. కానీ, బెస్ట్ విజువల్స్, ఎక్స్‌పీరియెన్స్ కోసం ఈ రెండింటిని ఇప్పటికీ థియేటర్లలో చూడమే ఉత్తమం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe