Ramayana: ఆస్కార్ గ్యారెంటీ.. రామాయణ మూవీపై మహారాష్ట్ర సీఎం ప్రశంసల వర్షం.. రాకపోతే మాత్రం అంటూ...
Ramayana: రామాయణ మూవీపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ గ్యారెంటీ అనేలా మాట్లాడారు. అకాడెమీ వాళ్లు దీనిని పరిశీలించకపోతే మాత్రం తాను తీవ్రంగా నిరాశ చెందుతానని అన్నారు.
Ramayana: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ 'రామాయణం'పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ అవార్డు రాకపోతే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని అన్నారు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ప్రైమ్ ఫోకస్ ‘ప్రైమ్ వన్’ స్టూడియోను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రైమ్ వన్ స్టూడియో ప్రారంభం.. సీఎం ఫడ్నవీస్ గ్రాండ్ స్పీచ్
ముంబైలో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను అందించే దిశగా నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ఫేజ్ 1 ప్లాన్స్‌లో భాగంగా ‘ప్రైమ్ వన్’ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జ్యోతి ప్రజ్వలన చేసి స్టూడియోను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు భాగాలుగా రాబోతున్న 'రామాయణం' సినిమా ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పురాణ ఇతిహాసాలను హాలీవుడ్ క్వాలిటీతో ప్రెజెంట్ చేస్తున్న మేకర్స్ ప్రయత్నాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాకు ఆస్కార్ రాకపోతే మాత్రం తాను తీవ్రంగా నిరాశ చెందుతానని అనడం గమనార్హం.
ఆస్కార్ విన్నర్ DNEG విజువల్స్.. హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్
ఈ 'రామాయణం' ప్రాజెక్ట్‌ను డిఎన్ఈజి (DNEG) ప్రొడక్షన్ హౌస్ అధినేత నమిత్ మల్హోత్రా, కెజిఎఫ్ స్టార్ యశ్ మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. డిఎన్ఈజి సంస్థ ఇప్పటివరకు 'డ్యూన్', 'టెనెట్' లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుంది.
ఇంతటి అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన టీమ్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుండటంతో విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని సీఎం ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ సినిమా అకాడమీ అవార్డును గెలుచుకోవడమే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.
ట్రైలర్‌పై మిశ్రమ స్పందన.. 'ఆదిపురుష్' పోలికలతో వివాదం
ఇటీవల శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా, న్యూఢిల్లీలోని ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా ప్రదర్శించారు. ఆ తర్వాత ఆన్‌లైన్ లో విడుదలైన ఈ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా లుక్స్ ఆకట్టుకున్నప్పటికీ, విజువల్స్ విషయంలో ప్రభాస్ 'ఆదిపురుష్' తో చాలామంది పోల్చి చూస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ ప్రతినిధులు మేకర్స్‌కి ఓ విజ్ఞప్తి చేశారు. గతంలో 'ఆదిపురుష్' సినిమాను చూడకుండా ప్రమోట్ చేయడం వల్ల కొన్ని తప్పులు జరిగాయని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు గుర్తుచేశారు. అందుకే ఈ 'రామాయణం' సినిమాను కూడా థియేటర్లలోకి తెచ్చేముందు తమ ప్రతినిధులకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని కోరారు.
ప్రదర్శించకపోతే నిరసనలు తప్పవు
శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ, "రామాయణం కోట్లాది మంది నమ్మకం, భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ముందస్తుగా మాకు ప్రదర్శించకుండా సినిమా రిలీజ్ చేస్తే, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో థియేటర్ల ముందు నిరసనలు చేపడతాం" అని హెచ్చరించారు.
ఏది ఏమైనప్పటికీ 'దంగల్' ఫేమ్ నితీష్ తివరి విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి కానుకగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


