...
...
Next Story

OTT Movies: ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ ఇరుముడి, ముగ్గురు హీరోల అమీర్ లోగ్- 2 డిఫరెంట్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ravi Teja Irumudi And Ameer Log OTT Streaming Details: థియేటర్లలో నిన్న రిలీజైన రవితేజ ఇరుముడి, ముగ్గురు హీరోలు నటించిన అమీర్ లోగ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై అమితాసక్తి నెలకొంది. రెండు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఇరుముడి, అమీర్ లోగ్ వేర్వేరు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఆ ఓటీటీలేంటో చూద్దాం.

Published on: Aug 22, 2026, 05:32:38 IST
Advertisement

Ravi Teja Irumudi And Ameer Log OTT Release Details: ఇలా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయంటే చాలు అలా వాటి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని క్యూరియాసిటీ చూపిస్తుంటారు. ప్రతి వారం సరికొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేసినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ అయిన మూవీస్‌పై మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది.

నిన్న రిలీజైన 2 సినిమాల ఓటీటీలు

ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ ఇరుముడి, ముగ్గురు హీరోల అమీర్ లోగ్- 2 డిఫరెంట్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ ఇరుముడి, ముగ్గురు హీరోల అమీర్ లోగ్- 2 డిఫరెంట్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అలా నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటి స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందులో ఒకటి రవితేజ ఇరుముడి అయితే.. మరొకటి ముగ్గురు హీరోలు నటించిన అమీర్ లోగ్.

ఎంతోకాలంగా సరైన హిట్ లేకుండా పడిగాపులు కాస్తున్న మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన డిఫరెంట్ సినిమానే ఇరుముడి. కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి స్టోరీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వచ్చిన రవితేజ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాడు. అంతేకాకుండా రవన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

ఆకట్టుకున్న రవితేజ సినిమా

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమాలో రవితేజతోపాటు బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రారంభం నుంచి అంచనాలతో విడుదలైన ఇరుముడి నిన్న శుక్రవారం (ఆగస్ట్ 21)న థియేటర్లలో విడుదల అయింది.

అలాంటి ఇరుముడి ఓటీటీలోకి వచ్చేయనుంది. దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇరుముడి ఓటీటీ హక్కులను సుమారు రూ. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే ఇరుముడి ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.

అయితే, సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇరుముడి ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఓటీటీలో ఇరుముడి సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో అందుబాటులో ఉండనుందని సమాచారం.

ముగ్గురు హీరోల అమీర్ లోగ్

రవితేజ ఇరుముడితోపాటు నిన్న థియేటర్లలో విడుదలైన మరో తెలుగు సినిమా అమీర్ లోగ్. ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా చేయగా బ్యూటిఫుల్ వేధా జలంధర్ కీలక పాత్ర చేసింది. వీరితోపాటు రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన సతీమణి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో అమీర్ లోగ్ యూత్‌ను అట్రాక్ట్ చేసింది. హైదరాబాదీ నేపథ్యంతో బిర్యానీ పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

అమీర్ లోగ్ కథ

హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన శ్రీను (ఎంసీ హరి), మల్లేష్ (శశిధర్), రఫీక్ (మనోజ్) చిన్నప్పటి నుంచి గల్లీ దోస్తులు. ఏ పని లేకుండా బస్తీలో తిరగడం, క్రికెట్ గొడవలు, ఇంట్లోవాళ్ల తిట్లు తింటుంటారు. వీరికి అక్కలా ఉండే గీత (వేధ జలంధర్) ఎప్పటికప్పుడు మంచి చెడులు చెబుతుంటుంది. కొన్నిరోజులకు ఈ ముగ్గురు స్నేహితులు కలిసి బిర్యానీ పాయింట్ పెడతారు.

ఆ తర్వాత ఏమైంది? అసలు వారికి బిర్యానీ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? బిర్యానీ పాయింట్‌తో ముగ్గురు బస్తీ పోరగాళ్లు సక్సెస్ అయ్యారా? లేదా? అనేదే అమీర్ లోగ్ మిగతా కథ. ఇదిలా ఉంటే, అమీర్ లోగ్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది.

అమీర్ లోగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అంటే, ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్ లోనే అమీర్ లోగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, అమీర్ లోగ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి, అమీర్ లోగ్ ఓటీటీ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా ఓటీటీలోకి వచ్చే వరకు ఆగకుండా ఇరుముడి, అమీర్ లోగ్ సినిమాలను థియేటర్లలోనే చూడటం బెస్ట్ ఆప్షన్ అని సినీ విశ్లేకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks