...
...
Next Story

OTT Thrillers: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 2 క్రైమ్ థ్రిల్లర్స్- ఒకటి రివేంజ్, మరోటి సైకలాజికల్- తెలుగులో స్ట్రీమింగ్

OTT Release Movies In Few Hours: ఓటీటీ లవర్స్‌కు వీకెండ్‌కి చూసేందుకు రేపటి నుంచి రెండు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఒకటి రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగితే మరోటి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించారు. అవేంటో చూద్దాం.

Published on: Oct 15, 2026, 15:29:27 IST
Advertisement

OTT Release Movies In Few Hours: దసరా సెలవుల సందర్భంగా ఓటీటీలో సినిమాల జోరు అదిరిపోతుంది. విభిన్నమైన కథాంశాలతో థియేటర్లలో మెప్పించిన రెండు క్రేజీ చిత్రాలు ఒకే రోజు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అదికూడా మరికొన్నిగంటల్లో ఈ రెండు డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఊర్వశి 'ఆశ'.. జీ5 వేదికగా ప్రతిక్షణం ఉత్కంఠ!

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 2 క్రైమ్ థ్రిల్లర్స్- ఒకటి రివేంజ్, మరోటి సైకలాజికల్- తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 2 క్రైమ్ థ్రిల్లర్స్- ఒకటి రివేంజ్, మరోటి సైకలాజికల్- తెలుగులో స్ట్రీమింగ్

సీనియర్ హీరోయిన్, నటి ఊర్వశి లీడ్ రోల్‌లో నటించిన మలయాళ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'ఆశ'. అక్టోబర్ 16న అర్థరాత్రి జీ5లో ఆశ ఓటీటీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నూతన దర్శకుడు సఫర్ సనల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా వినాయక అజిత్ నిర్మించారు. జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మీ మీనన్, భాగ్యలక్ష్మి కీలక పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఆశ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

గొడవకు దారితీసే రోడ్డు ప్రమాదం

సాధారణ జీవితం గడిపే ఒక తల్లి.. అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక చిన్న రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని జీమన్ (జోజు జార్జ్) తో గొడవకు దారితీసేలా చేస్తుంది. భర్తను కోల్పోయి ఇద్దరు కుమార్తెల కోసం బతికే ఆశ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసం చేసింది అనేదే అసలు కథ.

మరోవైపు, తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారిన రివేంజ్ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'డీసీ'. సోనీ లివ్ వేదికగా అక్టోబర్ 16 అర్థరాత్రి నుంచి డీసీ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన డీసీ థియేటర్లలో సంచలన విజయం సాధించింది. వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో మెరిసారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్ ఓటీటీ ప్రీమియర్ చేస్తోంది.

ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం

తనకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని చట్టవ్యతిరేక పనులు చేసే దేవదాస్ అలియాస్ దాస్ (లోకేష్ కనగరాజ్) జీవితంలోకి పార్వతి అనే గాయని అడుగుపెడుతుంది. అదే సమయంలో చంద్ర (వామికా గబ్బి) తన ఉనికి కోసం పోరాడుతుంటుంది.

ఈ ముగ్గురి జీవితాలు ఒక చోట కలవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి, ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం మధ్య కథ ఎలా సాగిందనే అంశాలను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ఆశ, డీసీ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ వీకెండ్‌లో చూసేందుకు ఓటీటీ వీక్షకులకు ఈ రెండు సినిమాలు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారనున్నాయి. అక్టోబర్ 16 అర్థరాత్రి నుంచి ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్స్ ఆశ, డీసీ తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks