iOS 26.2 విడుదల.. ఐఫోన్స్‌లో కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవే..
ఐఓఎస్ 26.2 సాఫ్ట్‌వేర్ అప్డేట్ని యాపిల్ విడుదల చేసింది. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఐఫోన్స్‌లో కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఏ ఐఫోన్స్ ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్కి అర్హత సాధిస్తాయి? కొత్త ఫీచర్స్ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల కోసం ఐఓఎస్ 26.2 (iOS 26.2) అప్‌డేట్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో విడుదలైన ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇది రెండొవ ప్రధాన అప్‌డేట్. ఐఓఎస్ 26.1 విడుదలైన ఒక నెల తర్వాత వచ్చిన ఈ అప్‌డేట్, ఇప్పుడు సపోర్ట్ ఉన్న డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 సిరీస్, ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌లో, అలాగే సెకెండ్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈలో ఈ ఐఓఎస్ 26.2 పనిచేస్తుంది.

యూజర్లు తమ సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేసి, జనరల్ మీద ట్యాప్ చేసి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎంచుకోవడం ద్వారా ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ)తో ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఐఓఎస్ 26.2 సిస్టమ్ టూల్స్, యాప్స్, భద్రతా ఫీచర్లలో మార్పులు కనిపిస్తాయి.
ఐఓఎస్ 26.2- రిమైండర్లు, లాక్ స్క్రీన్‌లో కొత్త ఫీచర్లు..
ఐఓఎస్ 26.2 లోని ముఖ్యమైన కొత్త ఫీచర్లలో ఒకటి అలారంను రిమైండర్‌గా సెట్ చేసుకునే ఆప్షన్! సమయాన్ని బట్టి పూర్తి చేయాల్సిన పనులను మర్చిపోకుండా ఉండటానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఈ రిమైండర్ అలారం స్నూజ్, లైవ్ యాక్టివిటీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు పనిని కొంతసేపు ఆలస్యం చేస్తూనే, ఆ టాస్క్‌ను స్క్రీన్‌పై చూసే అవకాశం ఉంటుంది.
లాక్ స్క్రీన్‌కు కొత్త కంట్రోల్స్-
ఐఫోన్ లాక్ స్క్రీన్‌కు కొత్త కంట్రోల్స్ జోడించారు. ముఖ్యంగా సమయాన్ని చూపించే డిస్‌ప్లే ఒపేసిటీని అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం లభించింది. ఇది బ్యాక్డ్రౌంగ్ని పట్టించుకోకుండా, సమయం ఎలా కనిపించాలో వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుంది.
ఎయిర్‌డ్రాప్‌లో సెక్యూరిటీ-
ఎయిర్‌డ్రాప్‌ను కూడా యాపిల్ అప్‌డేట్ చేసింది. తెలియని కాంటాక్ట్‌లతో ఫైళ్లను షేర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కోడ్ ఆధారిత అదనపు భద్రతా ప్రక్రియను జోడించారు. ట్రాన్స్ఫర్ని పూర్తి చేయడానికి రిసీవర్‌కి ఒక కోడ్ కనిపిస్తుంది. అది సెంటర్ ఎంటర్ చేయాలి.
ప్రాంతాలవారీగా కొత్త ఫీచర్లు-
ఐఓఎస్ 26.2 ఫీచర్లు ప్రాంతాలవారీగా విస్తరించడం జరుగుతుంది. ఎయిర్‌పాడ్స్ కోసం లైవ్ ట్రాన్స్‌లేషన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో అందుబాటులో ఉంది. జపాన్‌లో ఈ అప్‌డేట్ ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌లకు సపోర్ట్‌ను జోడించింది. ఇతర వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
ఐఓఎస్ 26.2- యాప్ అప్‌డేట్స్..
యాపిల్ మ్యూజిక్: హోమ్ ట్యాబ్‌లోని టాప్ పిక్స్ విభాగంలో ఇప్పుడు ఫేవరెట్ సాంగ్స్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. వినియోగదారులు తమ డివైజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్న ట్రాక్‌ల పాటల లిరిక్స్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు.
పాడ్‌క్యాస్ట్‌లు: వినియోగదారులు ఎపిసోడ్‌ల ద్వారా సులభంగా ముందుకు వెళ్లడానికి యాప్ ఇప్పుడు చాప్టర్‌లను స్వయంచాలకంగా సృష్టిస్తుంది. ఇది ఎపిసోడ్ సమయంలో ప్రస్తావించిన పాడ్‌క్యాస్ట్‌ల లింక్‌లను కూడా చూపుతుంది.
గేమ్స్ యాప్: వినియోగదారులు కేటగిరీ, సైజ్, ఇతర ఆప్షన్‌ల ద్వారా టైటిల్‌లను క్రమబద్ధీకరించడానికి కొత్త ఫిల్టర్‌లను పరిచయం చేసింది యాపిల్. ఇది ఇన్-గేమ్ ఛాలెంజ్ స్కోర్ బ్యానర్‌లను ప్రదర్శిస్తుంది. కనెక్ట్ చేసిన కంట్రోలర్‌లకు మెరుగైన సపోర్ట్‌ను జోడిస్తుంది.
ఈ అప్‌డేట్‌లో ఇతర మార్పులు కూడా ఉన్నాయి, అవి: యాపిల్ న్యూస్ టుడే ఫీడ్‌లో కొత్త నావిగేషన్ లింక్‌లు, ఒకే సెటప్ కోడ్‌తో బహుళ హోమ్ యాక్సెసరీలను జత చేయడానికి సపోర్ట్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల్లోే నోటిఫికేషన్‌ల కోసం స్క్రీన్ ఫ్లాష్ అలర్ట్‌లు. యాపిల్ మ్యూజిక్‌లో ఆల్బమ్ లభ్యతతో సమస్యలు, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్‌ల్లో తప్పు లేబుల్‌లు వంటి అనేక సమస్యలను కూడా యాపిల్ ఈ అప్‌డేట్‌లో పరిష్కరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


