Sign in

Alpha Trolls: సినిమా మధ్యలో ఈ నిర్మా యాడ్ ఏంటి.. ఇండియన్ స్పై ఏజెంట్స్ బికినీలు వేసుకుంటారా?: ఆల్ఫా మూవీపై ట్రోల్స్

Alpha Trolls: ఆలియా భట్ నటించిన ఆల్ఫా మూవీపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో స్పైగా నటించిన ఆలియాను బికినీలో చూపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా మధ్యలో ఈ నిర్మా యాడ్ ఏంటంటూ సెటైర్ వేస్తున్నారు.

Published on: Jul 3, 2026, 16:26:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Alpha Trolls: బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్ లో వైఆర్ఎఫ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' థియేటర్లలోకి వచ్చేసింది. కానీ రిలీజ్ రోజే ఆలియా, శర్వరీల హాట్ బికినీ సీన్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Alpha Trolls: సినిమా మధ్యలో ఈ నిర్మా యాడ్ ఏంటి.. ఇండియన్ స్పై ఏజెంట్స్ బికినీలు వేసుకుంటారా?: ఆల్ఫా మూవీపై ట్రోల్స్
Alpha Trolls: సినిమా మధ్యలో ఈ నిర్మా యాడ్ ఏంటి.. ఇండియన్ స్పై ఏజెంట్స్ బికినీలు వేసుకుంటారా?: ఆల్ఫా మూవీపై ట్రోల్స్

ఈ భారీ ప్రాజెక్టుకు మొదటి షో నుంచే ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఈ లీకైన బికినీ సీక్వెన్స్ పై ఆడియన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) మేకర్స్ ను ఆడుకుంటున్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై దారుణమైన ట్రోలింగ్

'ఆల్ఫా' మూవీలోని ఒక సీన్ లో ఆలియా, శర్వరీ ఇద్దరూ బికినీలు వేసుకుని ఒక పూల్ లో నుంచి బయటకు వస్తారు. ఈ సీన్ కు సంబంధించిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు యాక్టర్స్ తమ హాట్ బాడీ చూపిస్తూ గ్లామర్ డోస్ పెంచేసినా, నెటిజన్లకు మాత్రం ఇది అస్సలు నచ్చలేదు.

ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఇలాంటి బలవంతపు బికినీ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నిలదీస్తున్నారు. పైగా ఈ సీన్ ను ఒక పాత నిర్మా యాడ్ (Nirma ad)తో పోల్చుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "వైఆర్ఎఫ్ ఆల్ఫా మూవీలో ఈ నిర్మా యాడ్ ఎందుకు పెట్టారు భయ్యా?" అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు.

స్పైస్ ఇలా బికినీలతో ఉంటారా?

"యాక్షన్ మూవీలో గూఢచారులు ఇలా ఉంటారా? ఇది స్పై మూవీలా లేదు, ఇద్దరు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది" అని మరొకరు సెటైర్ వేశారు. టీజర్, ట్రైలర్ లో ఈ బికినీ సీన్ చూపించకుండా ఆడియన్స్ ను మోసం చేశారని కొందరు మండిపడుతున్నారు.

మహిళా ఏజెంట్లను గ్లామర్ డాల్స్ లా చూపించడం ఏంటని ఆదిత్య చోప్రాను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇండియన్ రా (RAW) ఏజెంట్స్ అంటే పవర్ ఫుల్ గా ఉండాలి కానీ, ఇలా బికినీ క్వీన్స్ లాగా చూపించడం వైఆర్ఎఫ్ కి అలవాటుగా మారిపోయిందని విమర్శిస్తున్నారు.

స్పై యూనివర్స్ కు బికినీ వివాదాలు కొత్తేం కాదు

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కు ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కోవడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో 'వార్ 2' మూవీలో కియారా అద్వానీ బికినీ సీక్వెన్స్ పైనా ఇలాంటి డిస్కషన్స్ నడిచాయి. ఒక స్పై క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ పక్కనపెట్టి అంత గ్లామరస్ గా ఎందుకు చూపించారని అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి.

అంతకు ముందు షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీలో దీపికా పదుకొనే ఆరెంజ్ బికినీ వేసుకున్న 'బేషరమ్ రంగ్' సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ వల్ల సినిమా బాయ్ కాట్ ట్రెండ్ తో పాటు నేషనల్ వైడ్ గా పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.

ఆల్ఫా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

'ది రైల్వే మెన్' లాంటి సూపర్ హిట్ సిరీస్ తీసిన శివ్ రావైల్ ఈ ఆల్ఫా మూవీకి డైరెక్టర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో వచ్చిన ఏడో సినిమా ఇది. ఫస్ట్ టైమ్ ఫీమేల్ లీడ్స్ తో వచ్చిన ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన ఐకానిక్ 'కబీర్' క్యారెక్టర్ లో ఒక పవర్ ఫుల్ క్యామియో చేసి ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు. ఒక సూపర్-సోల్జర్ సీరమ్ తీసుకున్న ట్రెయిన్డ్ హంతకురాలు తన మెంటర్ పైనే తిరగబడి ఫైట్ చేసే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.

ఎంత నెగిటివిటీ ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ లో సుమారు 90 వేల టికెట్స్ అమ్ముడుపోయి మొదటి రోజే రూ.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ డామినేట్ చేసిన ఈ స్పై యూనివర్స్ లో ఆలియా, శర్వరీ ఏ మేరకు సక్సెస్ అవుతారో ఈ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే అర్థమైపోతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More