Bhooth Bangla OTT Release Today: సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్‌లోనూ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రాల హవా నడుస్తోంది. దెయ్యాల కథలకు కాస్త వినోదాన్ని జోడించి దర్శకులు వదులుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
కామెడీ హారర్ థ్రిల్లర్

ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది.
థియేటర్లలో అలరించిన ఈ భయానక కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. నేటి నుంచి ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి, నవ్వించడానికి డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది భూత్ బంగ్లా సినిమా.
భూత్ బంగ్లా ఓటీటీ స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భూత్ బంగ్లా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూన్ 12న అంటే ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.
"గట్టిగా గొంతుతో అరిచి అందరినీ భయపెట్టేయండి.. భూత్ బంగ్లాలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు" అని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సరదాగా పోస్ట్ పెట్టింది.
ఓటీటీలో చూసేందుకు
{{/usCountry}}"గట్టిగా గొంతుతో అరిచి అందరినీ భయపెట్టేయండి.. భూత్ బంగ్లాలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు" అని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సరదాగా పోస్ట్ పెట్టింది.
ఓటీటీలో చూసేందుకు
{{/usCountry}}ఈ ప్రకటన రాగానే అక్షయ్ కుమార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు క్యూ కడుతున్నారు. అయితే, ప్రస్తుతానికి కేవలం హిందీ భాషలోనే భూత్ బంగ్లా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
దీంతో సౌత్ ఇండియా భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ భూత్ బంగ్లా సినిమాను డబ్ చేయాలని ఇక్కడి ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌ను కోరుతున్నారు. థియేటర్లలో మొదటి భాగం అద్భుతమైన కామెడీతో సాగిందని, రెండో భాగం కాస్త సాగదీసినట్లు అనిపించినా ఓటీటీలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరింత అద్భుతంగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అసలు 'భూత్ బంగ్లా' కథేంటి?
ఈ సినిమా కథ మొత్తం ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ (అక్షయ్ కుమార్), మీరా (మిథిలా పాల్కర్) అనే అన్నాచెల్లెళ్లకు తమ పూర్వీకుల నుంచి ఒక పాత కోట వారసత్వంగా వస్తుంది. అయితే ఆ కోట ఉన్న ఊరిలో ఒక వింత శాపం ఉంటుంది.
'వధూసూర్' అనే ఒక దుష్ట శక్తి అక్కడి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిపోతుంటుంది. ఆ భయంతో ఆ ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. ఈ విషయం తెలియని అర్జున్, తన చెల్లెలు మీరాకు అదే ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు.
ఆ తర్వాత ఆ బంగ్లాలో ఎలాంటి వింత సంఘటనలు జరిగాయి? అర్జున్ తన చెల్లెలి పెళ్లిని ఎలా జరిపించాడు? ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. ఈ సినిమా 'భూల్ భులయ్యా 2', 'సైతాన్', 'స్త్రీ' చిత్రాల కలయికలా ఉంటుందని బాలీవుడ్ విమర్శకులు పేర్కొన్నారు.
అక్షయ్-ప్రియదర్శన్ సినిమాలు
అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌కు ఇండియన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'హేరా ఫేరి' (2000), 'గరం మసాలా' (2005), 'భాగం భాగ్' (2006), 'భూల్ భులయ్యా' (2007), 'దే దనా దన్' (2009), 'ఖట్టా మీఠా' (2010) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ కామెడీ హిట్స్‌గా నిలిచాయి.
17 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో..
దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి చేసిన హారర్ కామెడీ చిత్రం కావడంతో 'భూత్ బంగ్లా'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, జిషూ సేన్‌గుప్తా, వామికా గబ్బి కీలక పాత్రలు పోషించారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
భూత్ బంగ్లా సినిమా ఇండియాలో రూ. 181.93 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 269.22 కోట్లు అంటే దాదాపుగా రూ. 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన భూత్ బంగ్లా సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేటి నుంచి ఎంచక్కా చూసేయండి.