ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇల్లు ఇల్లాలు పిల్లలు సెట్లో సెలబ్రేషన్స్.. నర్మదకు సర్‌ప్రైజ్.. ఏం జరిగిందంటే?
Illu Illalu Pillalu: ప్రముఖ బుల్లితెర నటి, 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ఫేమ్ అన్షు రెడ్డికి టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సీరియల్ సెట్లోనే ఆమె కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.
Illu Illalu Pillalu: బుల్లితెర నటీనటులకు వెండితెర స్టార్స్‌తో సమానంగా సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ట్రెండీ ఫోటో షూట్స్‌తో అభిమానులకు నిత్యం టచ్‌లో ఉండే సెలబ్రిటీలకు ఫాలోయింగ్ మామూలుగా ఉండటం లేదు. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ (Illu Illalu Pillalu) హీరోయిన్ అన్షు రెడ్డి (Anshu Reddy) తన సోషల్ మీడియా ప్రయాణంలో ఒక అద్భుతమైన ల్యాండ్‌మార్క్‌ను చేరుకుంది.

అన్షు రెడ్డి 1 మిలియన్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మదగా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న అన్షు రెడ్డి సోషల్ మీడియాలో ఒక రికార్డు అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య అధికారికంగా 1 మిలియన్ మార్కును దాటింది.
షూటింగ్ స్పాట్‌లో కేక్ కటింగ్ సర్ప్రైజ్!
అన్షు రెడ్డి 1 మిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టడంతో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ టీమ్ ఆమెకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. షూటింగ్ బ్రేక్‌లో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సెట్స్‌లోనే ఆమెతో కేక్ కట్ చేయించారు. కేక్‌పై '1M' అని ప్రత్యేకంగా అలంకరించి అన్షు రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
"నా బుల్లితెర కుటుంబం ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను ఒక నటిగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని అన్షు రెడ్డి ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.
నెట్టింట వైరల్ అవుతున్న విజువల్స్
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. సహ నటీనటులు అన్షు రెడ్డికి కేక్ తినిపిస్తూ, ఆటపట్టిస్తూ సందడి చేసిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
బుల్లితెరపై తన నటనతోనే కాకుండా.. రెగ్యులర్‌గా చేసే డాన్స్ రీల్స్, గ్లామరస్ ఫోటో షూట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూ అన్షు ఈ రేంజ్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ మైల్‌స్టోన్ అందుకున్నందుకు తోటి బుల్లితెర సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా ‘కంగ్రాచ్యులేషన్స్ అన్షు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. రామరాజు కుటుంబం చుట్టూ అల్లుకున్న కథనే ఈ సీరియల్. ఇప్పటికే ఈ సీరియల్ 500 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. ఇందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ నటి ఆమని తదితరులు నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


