...
...
Next Story

Spirit Varanasi: సరే, డేట్ మార్చేస్తాం.. నువ్వు వినాలనుకుంది ఇదేనా? ప్రభాస్ స్పిరిట్, మహేశ్ వారణాసిపై సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga On Spirit And Varanasi: ప్రభాస్ స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ రోమాంచకం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మహేశ్ బాబు వారణాసి సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 26, 2026, 18:34:46 IST
Advertisement

Sandeep Reddy Vanga On Spirit And Varanasi: డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంతోపాటు సినిమాలను నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ రోమాంచకం. తన ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన 'రోమాంచకం' సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సందడి చేశారు.

స్పిరిట్, వారణాసిపై సందీప్ రెడ్డి కామెంట్స్

సరే, డేట్ మార్చేస్తాం.. నువ్వు వినాలనుకుంది ఇదేనా? ప్రభాస్ స్పిరిట్, మహేశ్ వారణాసిపై సందీప్ రెడ్డి వంగా
సరే, డేట్ మార్చేస్తాం.. నువ్వు వినాలనుకుంది ఇదేనా? ప్రభాస్ స్పిరిట్, మహేశ్ వారణాసిపై సందీప్ రెడ్డి వంగా

ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్ 'స్పిరిట్' గురించిన అనేక విశేషాలను ఆయన పంచుకున్నారు. అదే సమయంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

"వారణాసి ఇంకా పెద్ద సినిమా!"

విలేకరుల సమావేశంలో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ.. 'స్పిరిట్', 'వారణాసి' రెండూ రూ. 1000 కోట్ల బడ్జెట్ సినిమాలే అని ప్రస్తావించగా సందీప్ వంగా వెంటనే స్పందించారు. "ఆ సినిమా ఇంకా పెద్దదండి" అని చేతి వేళ్లతో సైగ చేసారు సందీప్ రెడ్డి వంగా.

'స్పిరిట్' చిత్రం 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 7న 'వారణాసి' విడుదల కానుంది. ఇంత తక్కువ సమయంలో రెండు భారీ చిత్రాలు రావడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతుందా అని ప్రశ్నించారు ఒకరు.

సరే, డేట్ మార్చేస్తాం

సందీప్ రెడ్డి వంగా గతంలో తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ పొందాయి. అయితే వారి సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన 'రోమాంచకం' చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ వచ్చింది. ఈ ట్రాక్ రికార్డ్ మారడంపై ప్రశ్న ఎదురైంది.

"నేను ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా సెన్సార్ బోర్డు 'స్పిరిట్' సినిమాకు కచ్చితంగా 'A' సర్టిఫికేటే ఇస్తుంది" అని తెగేసి చెప్పారు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం 'స్పిరిట్' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని ఆయన వెల్లడించారు.

భారీ అంచనాలు.. స్టార్ క్యాస్టింగ్!

టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ప్రకాష్ రాజ్ వాయిస్ వినపడినప్పటికీ, ఆయన స్పిరిట్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు.

కొరియన్ యాక్షన్ స్టార్ హీరో డాన్ లీ ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ప్రణయ్ రెడ్డి వంగా ఇప్పటికే ఖండించారు. ఇంకోవైపు విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచి కథ అందిస్తున్న 'వారణాసి' చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద 2 భారీ సినిమాలు

వారణాసి సినిమాలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసిన విషయమే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks