Korean Kanakaraju OTT DC OTT GD Naidu OTT Release Platforms: థియేటర్లలోకి నిన్న (ఆగస్ట్ 7) మూడు క్రేజీ సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ఇప్పుడు వాటి ఓటీటీలోకి రానున్నాయనే వార్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ సినిమాలే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన డీసీ, ఆర్ మాధవన్ జీడీ నాయుడు సినిమాలు. ఈ మూడు సినిమాలు థియేటర్లలో ఆగస్ట్ 7న విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. మరి డిఫరెంట్ జోనర్లలో వచ్చిన ఈ 3 సినిమాల ఓటీటీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కామెడీ అదిరిపోయిందని టాక్ వస్తోంది.
రాయలసీమలోని ఓ గ్రామానికి చెందిన కనకరాజు అనే యువకుడికి కొరియన్ దెయ్యం పడితే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కింది. కొరియన్ కనకరాజు ఓటీటీ రైట్స్ సినిమా రిలీజ్‌కు ముందే అమ్ముడుపోయాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే కొరియన్ కనకరాజు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మాధవన్ 'జీడీ నాయుడు' బయోపిక్
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే కొరియన్ కనకరాజు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మాధవన్ 'జీడీ నాయుడు' బయోపిక్
{{/usCountry}}భారతదేశపు ఎడిసన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమానే జీడీ నాయుడు. ప్రియమణి, దుషారా విజయన్, జయరాం, సత్యరాజ్, యోగిబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు.
భారతదేశపు తొలి ఇండిజిజన్ మోటార్‌ను తయారు చేసిన లెజెండరీ ఇన్వెంటర్ జీడీ నాయుడు బయోపిక్. ఏవిధమైన ఉన్నత విద్య లేకుండానే కేవలం స్వీయ ప్రతిభతో ఎన్నో యంత్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలను కనిపెట్టిన ఆయన జీవితంలోని గెలుపోటములు, బ్రిటిష్ పాలనా కాలంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించారు.
జీడీ నాయుడు ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసుకుంది. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆర్ మాధవన్ జీడీ నాయుడు ఓటీటీ రిలీజ్ అవనుందని సమాచారం.
లోకేష్ కనగరాజ్ 'డీసీ'
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. అలాంటి ఈ డైరెక్టర్ హీరోగా మారిన సినిమానే డీసీ. డీసీ అంటే దాస్, చంద్ర అని సినిమాలోని పాత్రల పేరుతో పెట్టిన టైటిల్. దాస్‌గా లోకేష్ నటిస్తే.. చంద్రగా బ్యూటిఫుల్ హీరోయిన్ వామికా గబ్బి చేసింది.
మరో హీరోయిన్‌గా సంజన కృష్ణమూర్తి నటించింది. డీసీ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. రా అండ్ రస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు అరుణ్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఓ గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి డీసీ ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. కాబట్టి సన్ నెక్ట్స్ ఓటీటీలో లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన ఈ డీసీ మూవీ ప్రీమియర్ అవనుంది. అలాగే, డీసీ శాటిలైట్ రైట్స్‌ను సన్ టీవీ నెట్‌వర్క్ దక్కించుకుందని తెలుస్తోంది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
అయితే, కొరియన్ కనకరాజు, జీడీ నాయుడు, డీసీ ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ 4 ఒక్కరోజునే ఓటీటీ రిలీజ్ కానున్నాయని సమాచారం. అది కూడా తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
కానీ, ఈ సినిమాలకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్, టాక్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఓటీటీలోకి వచ్చే వరకు ఎదురుచూడటం కంటే థియేటర్లలోనే ఈ సినిమాలను ఎక్స్‌పీరియెన్స్ చేయడం ఉత్తమమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.