ఆదాయంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. 2026-27 నాటికి రూ.1.27 లక్షల కోట్లు టార్గెట్!
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 లక్షల కోట్ల ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ దిశగా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రం సొంతంగా ఆర్జించే ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ఆదాయ మార్గాల శాఖలు కసరత్తు ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.27 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గత రెండేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024-25: రూ. 1,04,345 కోట్లు, 2025-26: రూ. 1,10,643 కోట్లు (6 శాతం వృద్ధి), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం: మొదటి 42 రోజుల్లోనే 38 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కీలక శాఖల సహకారం
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా కొన్ని రంగాల నుండి ఆదాయం సమకూరింది. జీఎస్టీ: రూ. 33,679 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు: రూ. 11,047 కోట్లు, గనుల శాఖ: రూ. 10,300 కోట్లుగా ఉంది.
సాంకేతికతతో పన్ను ఎగవేతకు చెక్
పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెట్టకుండానే, ఆదాయం వృథా కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జీఎస్‌టీ చెల్లింపుల పరిశీలనలో ఏఐ టెక్నాలజీని వాడాలని ఆదేశించారు. భూ వివాదాలను పరిష్కరించడం ద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచవచ్చన్నారు.
వాహనం కొన్న 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాల్లో పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించడానికి ఆధునిక పద్ధతులను వాడాలని సీఎం సూచించారు: అనధికార కట్టడాలను గుర్తించేందుకు డ్రోన్ సర్వేలు, శాటిలైట్ చిత్రాలు, జీఐఎస్ మ్యాపింగ్‌ను ఉపయోగించాలని ఆదేశించారు.
జిల్లాలు - ఆర్థిక కేంద్రాలు
జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం వేగంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఖనిజాల విలువను పెంచి ఎగుమతి చేయడం, ఎర్రచందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేయాలన్నారు.
ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి ప్రజలకు సద్వినియోగం కావాలని చంద్రబాబు అన్నారు. ఆ దిశగా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, అందుకు అనుగుణంగా పన్ను వసూళ్లు కూడా పెరగాలని, అవినీతికి తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


