నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ రిక్రూట్‌మెంట్.. ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్(NCESS) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th ప్లస్ ఐటీఐ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Updated on: Jan 26, 2026, 17:59:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ జూనియర్ టెక్నీషియన్ (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రెగ్యులర్ పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ప్లస్ ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 10.02.2026 సాయంత్రం 5 గంటలకు వరకు ఉంది. http//www.ncess.gov.in మాత్రమే అప్లై చేయాలి.

ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

3 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.రూ.18,000 నుంచి 56,900 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం తేదీ 23 జనవరి 2026 కాగా చివరి తేదీ 10 ఫిబ్రవరి 2026గా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు లేదు.

ముఖ్యమైన విషయాలు

  • ఈ పోస్టులు భారత ప్రభుత్వంలో ఒకే హోదాలో ఉన్న ఉద్యోగులకు వర్తించే విధంగా భత్యాలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
  • అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. వీటిని తుది ఫలితం ప్రకటించే వరకు యాక్టివ్‌గా ఉంచాలి. ఈ ప్రకటనకు సంబంధించిన కమ్యూనికేషన్‌ అంతా అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఇమెయిల్ - ఐడీ/ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు.
  • ఎస్సీలకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వికలాంగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, మాజీ సైనికులు, కశ్మీరీ వలసదారులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులు ప్రస్తుత యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)తో తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలి. రాత పరీక్ష సమయంలో అసలు NOCని సమర్పించాలి. సమర్పించకపోతే ఫలితం నిలిపివేస్తారు.
  • అర్హతకు సంబంధించిన అన్ని విషయాలలో NCESS నిర్ణయం దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణ అంతిమంగా ఉంటుంది. ఈ విషయంలో ఏ వ్యక్తి నుండి కూడా ఎలాంటి విచారణ లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు స్వీకరించరు.
  • రాత పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేర్లు NCESS వెబ్‌సైట్‌లో (http//www.ncess.gov.in) తెలియజేస్తారు. ఈ మేరకు అభ్యర్థి అందించిన ఇ-మెయిల్ ఐడి ద్వారా సమాచారం వస్తుంది.
  • ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో, వెలుపల ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
  • అభ్యర్థులు అవసరమైనప్పుడు తమ దరఖాస్తులలో అందించిన వివరాలకు సంబంధించిన రుజువులను అసలు పత్రాలలో సమర్పించవలసి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?

  • దరఖాస్తులు ఆన్‌లైన్‌లో (http//www.ncess.gov.in) మాత్రమే స్వీకరిస్తారు.
  • దరఖాస్తుదారు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించి ఫోటోగ్రాఫ్, సంతకం, సంబంధిత మార్క్ షీట్‌లు (అన్ని సెమిస్టర్‌లకు), విద్యా/వృత్తిపరమైన అర్హతల కోసం ప్రొవిజనల్/డిప్లొమా సర్టిఫికేట్, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువు, అనుభవ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ అభ్యర్థులు) మొదలైన వాటి స్కాన్ చేసిన చిత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • సర్టిఫికేట్లు, సంతకం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీలు లేకుండా సమర్పించిన దరఖాస్తులు స్క్రీనింగ్ ప్రక్రియలోనే తిరస్కరిస్తారు.
  • ఫోటోగ్రాఫ్, సంతకం .jpg ఫార్మాట్‌లో ఉండాలి. ఫైల్ పరిమాణం 100 కేబీ కంటే తక్కువగా ఉండాలి. అన్ని సర్టిఫికేట్లు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ప్రతి ఫైల్ 300 కేబీ కంటే తక్కువగా ఉండాలి.
  • అభ్యర్థులు రాత పరీక్ష సమయంలో అసలు సర్టిఫికేట్లను సమర్పించాలి. అసలు సర్టిఫికేట్లను సమర్పించకపోయినా లేదా ఆన్‌లైన్‌లో సమర్పించిన వివరాలకు భిన్నంగా ఉన్నా అభ్యర్థిని రాత పరీక్షకు హాజరుకాకుండా అనర్హుడిగా ప్రకటిస్తారు.
  • ప్రస్తుతం ఏదైనా ఇతర సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు తమ ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించిన రుజువును సమర్పించాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే vacancies.ncess@gmail.comకు ఇమెయిల్ చేయండి.

ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More