Aishwarya Rajesh: ఒసేయ్ అంటూ ఐశ్వర్య రాజేష్ వీడియోపై లక్ష్మీ మంచు రియాక్షన్.. తన స్టైల్ కాపీ కొడుతూ వెక్కిరించడంతో..
Aishwarya Rajesh: లక్ష్మీ మంచు అమెరికన్ ఇంగ్లిష్ యాక్సెంట్ ను ఐశ్వర్య రాజేష్ ఇమిటేట్ చేయడంపై ఆమె రియాక్ట్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒసేయ్ అంటూ లక్ష్మీ కామెంట్ చేసింది.
Aishwarya Rajesh: టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా యాంకర్ కమ్ నటి అయిన మంచు లక్ష్మి ఇంగ్లీష్ యాసను ఇమిటేట్ చేస్తూ ఐశ్వర్య చేసిన అల్లరి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన తన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన 'ది హానెస్ట్ టౌన్ హాల్' ఇంటరాక్షన్ లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.
దీనిపై మంచు లక్ష్మి కూడా చాలా స్పోర్టివ్ గా రియాక్ట్ అవ్వడం విశేషం. ఈ సరదా సంఘటన వెనుక ఉన్న డీటెయిల్స్ తో పాటు మంచు మనోజ్ తో తనకున్న బాండింగ్ గురించి ఐశ్వర్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
మంచు మనోజ్ ఎమోషనల్ సపోర్ట్
చెన్నైలోని మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ లోనే తాను చదువుకున్నట్లు ఐశ్వర్య రాజేష్ ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. తన పెద్దన్నయ్య రాఘవేంద్ర, మంచు మనోజ్ ఇద్దరూ క్లాస్ మేట్స్ అని, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఆమె గుర్తుచేసుకుంది. అప్పట్లో మనోజ్, విష్ణు ఇద్దరూ స్కూల్ క్యాంపస్ లోని ఓ పెద్ద చెట్టు ఎక్కి కబుర్లు చెప్పుకునేవారని నాటి మెమొరీస్ ను నెమరువేసుకుంది.
దురదృష్టవశాత్తూ తన అన్నయ్య రాఘవేంద్ర చనిపోయిన తర్వాత మనోజ్ తనకు ఎంతో అండగా నిలిచాడని ఐశ్వర్య ఎమోషనల్ అయింది. "రాఘవేంద్ర లేడని నువ్వేం బాధపడకు.. నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను" అని మనోజ్ చెప్పిన మాటలు తననెంతో టచ్ చేశాయంది. మనోజ్ 11వ తరగతి చదివే టైమ్ లో తాను 5వ తరగతి చదువుతున్నానని, అందుకే తన మార్క్ అల్లరి పనులు తనపై ఎప్పుడూ ప్రయోగించలేదని నవ్వుతూ చెప్పింది.
ఇంగ్లీష్ యాసలో రెచ్చిపోయిన ఐశ్వర్య
ఇక మంచు లక్ష్మి గురించి చెప్తూ ఐశ్వర్య రాజేష్ ఇమిటేషన్ స్కిల్స్ తో అదరగొట్టింది. "లక్ష్మి అక్క అప్పట్లో యూఎస్ నుంచి స్కూల్ కు వచ్చేది. క్యాంపస్ లో మైక్ పట్టుకుని తనదైన యూఎస్ ఇంగ్లీష్ యాసలో క్లీన్లీనెస్ గురించి స్పీచ్ ఇచ్చేది" అని చెప్పింది. "పిల్లలూ.. చాక్లెట్ ర్యాపర్స్ కింద వేయకండి, డస్ట్ బిన్ లో వేయండి" అంటూ లక్ష్మి మంచు స్టైల్ లో ఇంగ్లీష్ యాసను అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
ఇంత స్టైలిష్ గా క్యాంపస్ ను క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పిన లక్ష్మి అక్కను తానెప్పటికీ మర్చిపోలేనని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే మంచు లక్ష్మి వెంటనే రియాక్ట్ అయింది. ఐశ్వర్య చేసిన ఇమిటేషన్ ను స్పోర్టివ్ గా తీసుకుని, "ఒసేయ్ (Oseyyyy)" అంటూ లాఫింగ్, రెడ్ హార్ట్ ఎమోజీలతో క్యూట్ గా కామెంట్ చేసింది.
ఇద్దరి కెరీర్ ట్రాక్ ఇలా..
గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం', 'తీయవర్ కులై నడుంగ' (Theeyavar Kulai Nadunga) లాంటి డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ను పలకరించిన ఐశ్వర్య రాజేష్ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ తో పాటు ఈటీవీ విన్ లో 'పాకశాల పంతం' సిరీస్ తో మంచి హిట్స్ అందుకుంది. త్వరలో 'ఓ..! సుకుమారి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోవైపు మంచు లక్ష్మి గతేడాది 'ది ట్రెయిటర్స్ ఇండియా' షోలో కంటెస్టెంట్ గా సందడి చేసింది. ఈ ఏడాది 'పూకీ', 'లేచింది మహిళా లోకం' చిత్రాల్లో నటించిన ఆమె.. ఆహా ఓటీటీలోకి వచ్చిన 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్' షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. రష్మీ గౌతమ్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో వైవా హర్ష మరో జడ్జిగా సందడి చేయనున్నాడు. కాగా గత ఏడాది తన డ్రెస్సింగ్ పై ఓ జర్నలిస్ట్ కామెంట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ తనకు సపోర్ట్ చేయలేదని మంచు లక్ష్మి రీసెంట్ గా చేసిన కామెంట్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


