Sign in

Dhanush Murugan: జూనియర్ ఎన్టీఆర్‌కు ధనుష్ పోటీ.. ఇటు గాడ్ ఆఫ్ వార్‌.. అటు తమిళ్ మురుగన్.. ఫస్ట్ లుక్ వీడియోపై ట్రోల్స్

Dhanush Murugan: జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తమిళ సూపర్ స్టార్ ధనుష్ లార్డ్ మురుగన్ పై మూవీ అనౌన్స్ చేశాడు. అయితే వెట్రి మారన్ డైరెక్షన్ లో సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియోపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

Published on: Jul 11, 2026, 07:28:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhanush Murugan: సౌత్ ఇండియాను షేక్ చేసిన 'అసురన్', 'వడ చెన్నై' లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ కాంబో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ మళ్లీ ఒక్కటయ్యారు. ఎప్పటినుంచో నడుస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ వీళ్లిద్దరి కొత్త ప్రాజెక్ట్ 'తమిళ్ మురుగన్' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి (లార్డ్ మురుగన్) కాన్సెప్ట్‌తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుండటంతో అదే కాన్సెప్ట్ లో వస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పోటీ కానుంది.

Dhanush Murugan: జూనియర్ ఎన్టీఆర్‌కు ధనుష్ పోటీ.. ఇటు గాడ్ ఆఫ్ వార్‌.. అటు తమిళ్ మురుగన్.. ఫస్ట్ లుక్ వీడియోపై ట్రోల్స్
Dhanush Murugan: జూనియర్ ఎన్టీఆర్‌కు ధనుష్ పోటీ.. ఇటు గాడ్ ఆఫ్ వార్‌.. అటు తమిళ్ మురుగన్.. ఫస్ట్ లుక్ వీడియోపై ట్రోల్స్

రూమర్లకు చెక్.. కానీ ఆ అనౌన్స్‌మెంట్ ఏంటి?

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పొల్లాదవన్', 'ఆడుకలం' నుంచి మొన్నటి 'అసురన్' వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అవార్డులు కూడా కొల్లగొట్టాయి. నిజానికి ధనుష్, వెట్రిమారన్ కాంబోలో 'వడ చెన్నై 2' వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ దాన్ని పక్కనపెట్టి 'తమిళ్ మురుగన్' పేరుతో ఈ డిఫరెంట్ స్టోరీని పట్టాలెక్కిస్తున్నారు.

నిజానికి ధనుష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో చేతులు కలుపుతున్నాడని మొన్నటిదాకా టాక్ నడిచింది. ఒక బాలీవుడ్ స్టార్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే గాసిప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు వెట్రిమారన్ తోనే ఫిక్స్ అయ్యాడు మన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.

ఫస్ట్ లుక్ వీడియోపై ట్రోల్స్

అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో గ్లింప్స్ చాలా హడావుడిగా రిలీజ్ చేసినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ప్యూర్ గా ఏఐ (AI) జనరేటెడ్ విజువల్స్ తో, క్వాలిటీ లేకుండా డిజైన్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. కనీసం ఒక సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేదని ధనుష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఎన్టీఆర్ vs ధనుష్.. మురుగన్ కాన్సెప్ట్ తో క్లాష్?

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. మురుగన్ కాన్సెప్ట్ తో సౌత్ లో వస్తున్న రెండో భారీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే ఓ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయింది. ఒక పాపులర్ నవల ఆధారంగా త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పుడు కరెక్ట్ గా అదే మురుగన్ థీమ్ తో ధనుష్, వెట్రిమారన్ బరిలోకి దిగడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య కచ్చితంగా క్లాష్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. తెలుగు వాళ్లకంటే తమిళులకు మురుగన్ అంటే విపరీతమైన భక్తి, ఎమోషన్ ఉంటాయి. ఆ నేటివిటీని వెట్రిమారన్ లాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తనదైన స్టైల్ లో అథెంటిక్ గా ప్రెజెంట్ చేస్తాడని కోలీవుడ్ ట్రేడ్ పండితులు గట్టిగా నమ్ముతున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా ఫైట్

ధనుష్ సినిమా పూర్తి మైథలాజికల్ జానర్ లో ఉంటుందా లేక ఫాంటసీ ఎలిమెంట్స్ తో సాగే కాంటెంపరరీ డ్రామానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తారక్, త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అదే సమయంలో అనిరుధ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సాయి అభ్యంకర్ ధనుష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. గురువు ఒక సినిమాకు, శిష్యుడు ఇంకో సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేక వేరు వేరు టైమ్స్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More