Allu Arjun Place On Most Valuable Celebrities India List: భారతదేశంలో కొందరు నటీనటులు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఒక బ్రాండ్‌గా మారుతుంటారు. వరుస హిట్లు, ప్రతిష్టాత్మక అవార్డులు, బ్రాండ్ ప్రకటనలతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.
ఏడేళ్లుగా ఒక్క సినిమా

అయితే, గత ఏడేళ్లుగా బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాకపోయినా ఒక భారతీయ నటి మాత్రం గ్లోబల్ లెవెల్‌లో టాప్ బ్రాండ్‌గా దూసుకుపోతోంది. ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
టాప్‌లో విరాట్ కోహ్లీ..
కేవలం బాక్సాఫీస్ వసూళ్లు, ఎండార్స్‌మెంట్ల ఆధారంగా కాకుండా పలు కఠినమైన ప్రమాణాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఏకైక మహిళా నటిగా ప్రియాంక రికార్డ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మూడో స్థానాన్ని దక్కించుకుని సరికొత్త రికార్డ్ సృష్టించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళా సెలబ్రిటీ ప్రియాంక కావడం గమనార్హం. అంటే, హీరోయిన్‌గా మొదటి స్థానం సంపాదించుకుంది ప్రియాంక చప్రా. బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా చివరిగా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమా 2019లో విడుదలైంది. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆమెకున్న క్రేజ్ వల్ల బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు.
మిగతా స్థానాల్లో
ఈ జాబితాలో మిగిలిన స్థానాలను చూస్తే.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రణ్వీర్ సింగ్ (5), అక్షయ్ కుమార్ (6), అమితాబ్ బచ్చన్ (7), సచిన్ టెండూల్కర్ (8), అలియా భట్ (9) వరుస స్థానాల్లో నిలిచారు. 'పుష్ప' సినిమాతో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుని తెలుగు సినిమా సత్తాను చాటారు.
అసలు బ్రాండ్ వాల్యూను ఎలా లెక్కించారు?
{{/usCountry}}ఈ జాబితాలో మిగిలిన స్థానాలను చూస్తే.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రణ్వీర్ సింగ్ (5), అక్షయ్ కుమార్ (6), అమితాబ్ బచ్చన్ (7), సచిన్ టెండూల్కర్ (8), అలియా భట్ (9) వరుస స్థానాల్లో నిలిచారు. 'పుష్ప' సినిమాతో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుని తెలుగు సినిమా సత్తాను చాటారు.
అసలు బ్రాండ్ వాల్యూను ఎలా లెక్కించారు?
{{/usCountry}}కేవలం సెలబ్రిటీల సంపాదన లేదా సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఈ రేటింటింగ్ ఇవ్వలేదు. సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్ బలాన్ని అంచనా వేయడానికి ఒక ప్రత్యేకమైన విశ్లేషణాత్మక పద్ధతిని ఉపయోగించారు.
"సెలబ్రిటీల ఆర్థిక ప్రదర్శనతో పాటు వారికున్న ప్రత్యేకత, స్పష్టత, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్, ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకం, బాధ్యత వంటి పలు అంశాలను లోతుగా పరిశీలించి ఈ బ్రాండ్ వాల్యూను లెక్కించాము" అని ఫార్చ్యూన్ ఇండియా నివేదిక వెల్లడించింది. సెలబ్రిటీల వ్యక్తిగత ఇమేజ్‌ను ఒక ఆర్థిక ఆస్తిగా భావించి ఈ విశ్లేషణ చేశారు.
గాడ్‌ఫాదర్ లేకుండా గ్లోబల్ స్టార్‌గా..
మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ప్రియాంక చోప్రా 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఐత్రాజ్, ఫ్యాషన్, ముజ్సే షాదీ కరోగీ, డాన్, క్రిష్ వంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు.
'ఫ్యాషన్' సినిమాలో అద్భుత నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. బాజీరావ్ మస్తానీ, మేరీ కోమ్, బర్ఫీ వంటి సినిమాలతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకపోయినా తన సొంత ప్రతిభతోనే బాలీవుడ్‌ను ఏలారు.
ఓటీటీ సినిమాలతో
భారతదేశంలో స్టార్‌డమ్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడే ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్ వైపు అడుగులు వేశారు. 'క్వాంటికో' ఓటీటీ సిరీస్‌తో అక్కడ లీడ్ రోల్ సాధించి, బేవాచ్, ది మేట్రిక్స్ 4 వంటి భారీ చిత్రాలలో నటించారు.
ప్రస్తుతం 'సిటాడెల్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన 'ది బ్లఫ్' మూవీతో ఆమె ప్రేక్షకులను అలరించారు.
రాజమౌళి సినిమాతో తెలుగు ఎంట్రీ
త్వరలోనే ప్రియాంక చోప్రా తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వారణాసి' సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రియాంక 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది.