...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5లో!

Friday OTT Release Movies Telugu: ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే తెలుగులో 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఒక్కోటి ఒక్కో రకంగా అలరిస్తున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, వాటి జోనర్లు ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Aug 8, 2026, 05:45:37 IST
Advertisement

Friday OTT Release Movies Telugu: వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమా ప్రియుల చూపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పైనే ఉంటుంది. థియేటర్ల దాకా వెళ్లే ఓపిక లేనివారు, ఇంట్లోనే హాయిగా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

ఒక్కరోజే టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5లో!
ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం-నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5లో!

దానికి తగ్గట్టే ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 నిన్న (ఆగస్ట్ 7) ఒక్కరోజే సరికొత్త సినిమాలను తీసుకొచ్చాయి. మిలిటరీ యాక్షన్ డ్రామా, రూరల్ లవ్ స్టోరీస్, డార్క్ కామెడీ థ్రిల్లర్స్ వరకు ప్రతీ ఒక్కరి అభిరుచికి తగినట్లుగా ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్: దేశభక్తి భావనలు, హృదయాన్ని హత్తుకునే ప్రణయ గాథలు

ఆపరేషన్ సఫేద్ సాగర్ ఓటీటీ

గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కార్గిల్ యుద్ధ నేపథ్యంతో సాగే అద్భుతమైన మిలిటరీ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్' పేరుతో తెరకెక్కిన ఈ హిందీ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హీరో సిద్ధార్థ్ నటించిన ఈ ఓటీటీ సిరీస్ భారత వైమానిక దళం (IAF) కార్గిల్ యుద్ధంలో చూపిన సాహసాలు, దేశభక్తి ఘట్టాలతో రూపొందింది.

ఇదయం మురళి ఓటీటీ

డిజిటల్ సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకోవడంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆగస్ట్ 7న మూడు భిన్నమైన వైవిధ్యభరిత చిత్రాలను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కస్టమర్ల ముందుకు తెచ్చింది.

ఓ సుకుమారి ఓటీటీ: ఐశ్వర్య రాజేష్, తిరువీర్ జోడీగా నటించిన ఓ సుకుమారి పల్లెటూరి నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలకు చూపించారు.

ఎమ్‌ఆర్‌పీ ఓటీటీ: క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కోసం రూపుదిద్దుకున్న డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఇది. ఊహించని మలుపులు, కామెడీతో థ్రిల్ అందించే ఈ సినిమాలో నరేష్ అగస్త్య, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్ నటించారు. శవంతో కోట్లలో డీలింగ్ పెట్టుకునే కథతో ఈ సినిమా తెరకెక్కింది.

వదంది సీజన్ 2 ఓటీటీ: తొలి సీజన్‌తో విపరీతమైన ఆదరణ పొందిన తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ 'వదంది' రెండో సీజన్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌లో ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వకూడదని నెటిజన్లు చెబుతున్నారు.

జీ5 ఓటీటీ: గ్రామీణ వాతావరణం, ఎమోషనల్ డ్రామాలు

స్థానిక కంటెంట్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే జీ5 ఓటీటీ.. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న రెండు ఆసక్తికర చిత్రాలను నిన్న తీసుకువచ్చింది.

లెనిన్ ఓటీటీ: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పూర్తి స్థాయి రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సినిమా ఇది. మాస్ ప్రేక్షకులతో పాటు యూత్‌ను కూడా విశేషంగా ఆకట్టుకున్న లెనిన్ ఓటీటీలో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

వంద దేవుళ్లు ఓటీటీ: బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ వైవిధ్యమైన కథతో వచ్చిన సినిమానే వంద దేవుళ్లు. స్వాసిక మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నూరు సామికి తెలుగు వెర్షన్. ఓ వితంతువుకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇంటి నుంచి సమాజం వరకు ఒక్కొక్కరు ఎలా ఆలోచించారనే కథతో ఈ సినిమాను రూపొందించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks