Mothers Day Ott: మదర్స్ డే స్పెషల్- అమ్మతో కలిసి తప్పకుండా ఓటీటీలో చూడాల్సిన ఎమోషనల్ మూవీస్.. ఓ లుక్కేయండి

Mothers Day Ott: దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడ‌ని అంటారు. అమ్మ లేకపోతే సృష్టే లేదు. అలాంటి తల్లులందరి గొప్పతనాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందే. అయితే ప్రత్యేకంగా మదర్స్ డే అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇవాళ అమ్మతో కలిసి ఓటీటీలో చూడాల్సిన సినిమాలపై లుక్కేయండి.

Published on: May 10, 2026, 13:36:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమ్మ అనే రెండక్షరాల పిలుపులోనే అనంతమైన ప్రేమ దాగి ఉంది. మన కళ్లలో నీరు తిరిగితే తల్లడిల్లిపోయేది, మన చిన్న విజయానికే మురిసిపోయేది కేవలం అమ్మ మాత్రమే. మే 10న 'మదర్స్ డే' సందర్భంగా, ఆ మాతృమూర్తి త్యాగాలను స్మరించుకుంటూ, ఆమెతో కలిసి క్వాలిటీ టైమ్ గడపడం కంటే గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు.

మదర్స్ డే ఓటీటీ సినిమాలు (x)
మదర్స్ డే ఓటీటీ సినిమాలు (x)

ఓటీటీ సినిమాలు

నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో అమ్మకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి మన సమయం. ఈ ప్రత్యేక రోజున ఇంట్లోనే అమ్మ పక్కన కూర్చుని, మనసును హత్తుకునే కొన్ని తెలుగు సినిమాలను ఓటీటీలో వీక్షించండి. ఆ అనుభూతిని మరింత పెంచే ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

ఒకే ఒక జీవితం

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒకే ఒక జీవితం చిత్రం కొడుకుకు, తల్లికి మధ్య ఉండే విడదీయలేని బంధాన్ని చూపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథ అయినప్పటికీ, ఇందులో పండిన ఎమోషన్స్ చాలా సహజంగా ఉంటాయి. చనిపోయిన తన తల్లిని మళ్లీ చూసే అవకాశం వస్తే ఒక కొడుకు ఏం చేస్తాడనేది కథ. శర్వానంద్ అద్భుతమైన యాక్టింగ్ తో మెప్పించాడు. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో ఉంది.

బిచ్చగాడు

కోట్లు ఉన్నా తల్లి ప్రాణాల ముందు అవి తృణప్రాయమని నిరూపించే చిత్రమిది. కోమాలోకి వెళ్ళిన తన తల్లి ఆరోగ్యం కోసం ఒక కోటీశ్వరుడు భిక్షగాడిగా మారడం అనే పాయింట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. విజయ్ ఆంటోనీ నటన, ముఖ్యంగా ఆ తల్లి సెంటిమెంట్ సాంగ్స్ గుండెల్ని పిండేస్తాయి. బిచ్చగాడు సినిమా సన్ నెక్ట్స్ లో ఉంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమల పాత్ర ప్రతి మధ్యతరగతి అమ్మకు ప్రతిరూపం. పిల్లల భవిష్యత్తు కోసం అమ్మ పడే తపన ఇందులో కనిపిస్తుంది. ఆఖర్లో తల్లి గురించే ఆ చిన్న పాప ఇచ్చే స్పీచ్ కు కరగని గుండె ఉండదు. ఈ చిత్రం జియోహాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

పూరీ జగన్నాథ్ మార్క్ మేకింగ్‌లో వచ్చిన ఈ చిత్రంలో జయసుధ, రవితేజ మధ్య బాండింగ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. తన కొడుకును ఒక ఛాంపియన్‌గా చూడాలనుకునే తల్లి ఆశయం, తల్లి కోసం కొడుకు చేసే పోరాటం ఇందులో పీక్స్‌లో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ని ఇస్తుంది. ఇది సన్ నెక్ట్స్ లో ఉంది.

మాతృదేవోభవ

ఎన్ని ఏళ్ళయినా సరే, అమ్మ సెంటిమెంట్ అంటే టక్కున గుర్తొచ్చే సినిమా మాతృదేవోభవ. ఇందులో మాధవి నటన చూసి కన్నీరు పెట్టని వారుండరు. ఈ మదర్స్ డేకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ ఛాయిస్. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ అమ్మతో కలిసి ఈ సినిమాలను ఎంజాయ్ చేయండి. హ్యాపీ మదర్స్ డే!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More