Sign in

OTT Releases: ఈవారమే ఓటీటీలోకి మూడు సంక్రాంతి సినిమాలు.. ఏ మూవీ ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి ఈవారంలోనే మూడు సంక్రాంతి సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుండటం విశేషం. వీటిలో ప్రభాస్ ది రాజా సాబ్ తోపాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, శివకార్తికేయన్ పరాశక్తి మూవీస్ ఉన్నాయి. వీటిని ఎక్కడ, ఎప్పుడు చూడాలో తెలుసుకోండి.

Published on: Feb 2, 2026, 14:24:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈవారం థియేటర్ల రిలీజ్ మాట ఎలా ఉన్నా.. ఓటీటీలో మాత్రం టాప్ మూవీస్ రాబోతున్నాయి. వీటిలో మూడు సంక్రాంతికి రిలీజైనవే కావడం విశేషం. రెండు నెల రోజుల్లోపే రాబోతుండగా.. ఒకటైతే మరీ 20 రోజులకే స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరి ఆ మూవీస్ ఏవి? ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

OTT Releases: ఈవారమే ఓటీటీలోకి మూడు సంక్రాంతి సినిమాలు.. ఏ మూవీ ఎందులో చూడాలంటే?
OTT Releases: ఈవారమే ఓటీటీలోకి మూడు సంక్రాంతి సినిమాలు.. ఏ మూవీ ఎందులో చూడాలంటే?

నారీ నారీ నడుమ మురారి - ప్రైమ్ వీడియో

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో అన్నింటి కంటే ముందుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయినా కూడా మూడు వారాల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అడుగుపెట్టబోతోంది. అది కూడా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.

ది రాజా సాబ్ - జియోహాట్‌స్టార్

ప్రభాస్ నటించిన మరో డిజాస్టర్ మూవీ ది రాజా సాబ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజైంది. అయితే నెగటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను చవిచూసింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ మూవీ మిస్ అయి ఉంటే ఓటీటీలో చూడొచ్చు.

పరాశక్తి - జీ5 ఓటీటీ

ఇక శివకార్తికేయన్, శ్రీలీల నటించిన తమిళ సినిమా పరాశక్తి కూడా ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి కూడా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

వచ్చే వారం మిగిలిన మూవీస్

ఇక ఈ ఏడాది తెలుగులో సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తిలాంటి సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్లు ఇంకా వెల్లడించలేదు. అయితే ఇవి వచ్చే వారం అడుగుపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11 నుంచి 13 మధ్య ఈ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More