Sign in

Tilak Varma: టైమ్ ఔట్‌లో ఏం తాగావ‌య్యా.. సై సినిమాలోలాగా రెచ్చిపోయిన తిల‌క్ వ‌ర్మ‌.. ఐపీఎల్‌లో ఫ‌స్ట్ సెంచ‌రీ

Tilak Varma: అదేం బాదడు.. అదేం విధ్వంసం! బాల్ పై ఏదో పగ ఉన్నట్లు, బౌలర్లపై ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. టైమ్ ఔట్ కు ముందు ఒకలా ఆడిన అతను, ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. 

Published on: Apr 21, 2026, 09:10:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tilak Varma: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘సై’ మూవీ అందరికీ తెలిసిందే. ఇందులో క్లైమాక్స్ లో వచ్చే రగ్బీ గేమ్ లో విలన్ జట్టు చేతిలో హీరో టీమ్ చావుదెబ్బలు తింటుంది. కానీ టైమ్ ఔట్ తర్వాత హీరో టీమ్ రెచ్చిపోయి ఆడుతుంది. ఆ టైమ్ ఔట్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అచ్చం అలాగే ఐపీఎల్ 2026లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చెలరేగిపోయాడు.

తిలక్ వర్మ (REUTERS)
తిలక్ వర్మ (REUTERS)

తిలక్ వర్మ సెంచరీ

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. సోమవారం (రాత్రి) గుజరాత్ టైటాన్స్ తో పోరులో ఈ ముంబయి ఇండియన్స్ ఆటగాడు సెంచరీ బాదేశాడు. వీర విధ్వంసంతో ఐపీఎల్ లో తన ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. కేవలం 45 బాల్స్ లోనే 101 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.

22 బాల్స్ లో 19

జీటీతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ అయిదో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. అతని ఇన్నింగ్స్ ను టైమ్ ఔట్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆడిన 22 బాల్స్ లో తిలక్ జస్ట్ 19 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో తిలక్ మరోసారి డిసప్పాయింట్ చేస్తాడేమో అనిపించింది.

టైమ్ ఔట్ తర్వాత

కానీ టైమ్ ఔట్ తో కథ మారిపోయింది. ముంబయి ఇండియన్స్ స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ తర్వాత తిలక్ వర్మ మామూలుగా రెచ్చిపోలేదు. ఆ తర్వాత ఆడిన 23 బాల్స్ లోనే ఏకంగా 82 రన్స్ సాధించాడు. బంతిని ఎడాపెడా బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అశోక్ వర్మ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 6, 6 కొట్టాడు.

ఏం తాగావయ్యా?

టైమ్ ఔట్ లో తిలక్ తో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తిలక్ ను హార్దిక్ మోటివేట్ చేశాడు. ఆ తర్వాత తిలక్ రెచ్చిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో టైమ్ ఔట్ లో తిలక్ ఏం తాగాడయ్యా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ముంబయి ఇండియన్స్ విక్టరీ

ఐపీఎల్ 2026లో వరుసగా నాలుగు ఓటముల తర్వాత ముంబయి ఇండియన్స్ ఓ విక్టరీ అందుకుంది. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ ను 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఛేజింగ్ లో జీటీ 100 రన్స్ కే కుప్పకూలింది.

ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో బుమ్రాకు ఫస్ట్ వికెట్ కూడా దక్కింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More