Aadarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్ రైలు ఎపిసోడ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఆదర్శ కుటుంబం నుంచి క్రేజీ అప్డేట్
Aadarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో వచ్చే రైలు ఎపిసోడ్ మొత్తం మూవీకే హైలైట్ అని, థియేటర్లు నవ్వులతో దద్దరిల్లుతాయని తాజాగా వార్తలు వస్తున్నాయి.
Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోకి ఉన్న సపరేట్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఆ సినిమాల్లో వెంకీ మార్క్ కామెడీ టైమింగ్ ఇప్పటికీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ డైరెక్టర్, హీరోగా కలిసి చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
నవ్వుల సునామీ తెప్పించే ట్రైన్ ఎపిసోడ్
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ ఉండబోతోందని టాక్. సిట్యువేషనల్ కామెడీతో సాగే ఈ సీక్వెన్స్ థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించడం గ్యారెంటీ అని చెబుతున్నారు. రీసెంట్‌గానే ఈ ట్రైన్ బ్లాక్ షూటింగ్ పూర్తి చేశారట. ఈ కామెడీ ఎపిసోడ్‌లో వెంకటేష్ తన వింటేజ్ స్టైల్‌లో ఇరగదీశాడని తెలుస్తోంది.
త్రివిక్రమ్ పెన్ పవర్, వెంకీ ఎక్స్‌ప్రెషన్స్ కలిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ఈ సీన్ ప్రూవ్ చేస్తుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా దీనిని ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ (KGF) మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె యాక్టింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానుంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఇంటెన్స్ బీజీఎమ్
టాలీవుడ్ టాప్ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి హిట్స్ ఇచ్చిన బ్యానర్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోనున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి హాలిడే కావడంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పక్కా.
ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. యానిమల్ (Animal), అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకు సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి అతని ఇంటెన్స్ బీజీఎమ్ సినిమాకు ప్రాణం పోయనుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ మెప్పించేలా ఈ సినిమాను మేకర్స్ డిజైన్ చేస్తున్నారు.
ఆదర్శ కుటుంబం సినిమా వివరాలు
✦ సినిమా పేరు: ఆదర్శ కుటుంబం
✦ హీరో: విక్టరీ వెంకటేష్
✦ హీరోయిన్: శ్రీనిధి శెట్టి
✦ డైరెక్టర్: త్రివిక్రమ్ శ్రీనివాస్
✦ ప్రొడ్యూసర్: ఎస్. రాధాకృష్ణ
✦ బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
✦ మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
✦ రిలీజ్ డేట్: అక్టోబర్ 2, 2026
✦ జానర్: ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


