Sign in

AK 47 Release Date: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 రిలీజ్ డేట్ ఇదే.. నాగ వంశీయే చెప్పాడు

AK 47 Release Date: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (Adarsha Kutumbham House No. 47). తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు.

Published on: Jun 18, 2026, 13:41:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AK 47 Release Date: టాలీవుడ్ లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా వస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ కావడంతో 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' (#AK47)పై ప్రేక్షకుల్లో కొండంత అంచనాలు ఉన్నాయి.

AK 47 Release Date: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 రిలీజ్ డేట్ ఇదే.. నాగ వంశీయే చెప్పాడు
AK 47 Release Date: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 రిలీజ్ డేట్ ఇదే.. నాగ వంశీయే చెప్పాడు

ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అక్టోబర్ 2, 2026 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. ఇది వెంకీ ఫ్యాన్స్ కు ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

అక్టోబర్ 2 కంటే ముందేనా?

ఆదర్శ కుటుంబం మూవీపై వచ్చిన ఓ ట్వీట్ పై నిర్మాత నాగ వంశీ స్పందించారు. “అక్టోబర్ 2 కంటే ముందే రిలీజా? చాలా ఫాస్ట్ సర్.. స్పీడు చూస్తుంటే మీరే డైరెక్షన్ చేస్తున్నట్లు ఉన్నారు.. అనిల్ గారు అనుకున్నాను.. సారీ” అంటూ నాగ వంశీ అనడం విశేషం.

ఏకే 47 విశేషాలు

ఏకే 47 మూవీలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ మామ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తోంది.

వీరితో పాటు ఈ ఉమ్మడి కుటుంబం కథలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ (Thaman) ఈ చిత్రానికి అదిరిపోయే ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ట్యూన్స్ అందిస్తున్నారు.

ఒకే రోజు అనిల్ రావిపూడి మూవీ లాంచ్.. త్రివిక్రమ్ మూవీ డేట్ లాక్

ఈరోజు (జూన్ 18) విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ దక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగాయి.

ఆ క్రేజీ ఈవెంట్ హడావిడి ముగిసేలోపే.. ఇటు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా లాక్ అవ్వడంతో వెంకటేష్ లైనప్ టాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ మధ్యతరగతి ఫ్యామిలీ డ్రామా సెకండ్ హాఫ్ లో ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో పాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

హెచ్‌టీ విశ్లేషణ

వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ కామెడీకి, త్రివిక్రమ్ మార్క్ ప్రాస డైలాగ్స్ తోడైతే థియేటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. అక్టోబర్ 2 లాంటి లాంగ్ హాలిడే వీకెండ్ (గాంధీ జయంతి, దసరా సీజన్ బ్యాక్‌డ్రాప్)ను టార్గెట్ చేయడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More