ఐఫోన్ యూజర్స్‌కి అతి త్వరలోనే iOS 26.2 అప్‌డేట్- కొత్త ఫీచర్స్ ఇవే..!
ఐఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఐఓఎస్ 26.2 అప్‌డేట్ అతి త్వరలోనే విడుదులయ్యే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ కోసం అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అప్డేట్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల కోసం తమ తదుపరి ప్రధాన అప్‌డేట్ అయిన ఐఓఎస్ 26.2ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ వారంలోనే ఈ అప్‌డేట్ ఐఫోన్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఇప్పటికే బీటా టెస్టర్‌లకు రిలీజ్ కాండిడేట్ (ఆర్సీ) వెర్షన్‌ను షేర్ చేసిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అంటే అప్‌డేట్ కూడా త్వరలోనే లాంచ్ అవుతుందని అర్థం.

యాపిల్ ఐఓఎస్ 26.2 లాంచ్ టైమ్‌లైన్..
సాధారణంగా, ఆర్సీ (రిలీజ్ కాండిడేట్) వెర్షన్ అనేది ప్రజలకు విడుదల చేసే ముందు ఉండే ఫైనల్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌గా పరిగణిస్తారు. గత వారం, యాపిల్ ఐఓఎస్ 26.2 ఆర్సీ బిల్డ్‌ను బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంచింది.
ప్రముఖ లీక్‌స్టర్ ఒకరు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ 26.2 కోసం 23సీ52, 23సీ54 బిల్డ్ నంబర్‌లను పంచుకున్నారు. మొదటి ఆర్సీ బిల్డ్ నంబర్ 23సీ52గా ఉంది. రెండు వేర్వేరు బిల్డ్ నంబర్‌లు ఎందుకనేది ధృవీకరించనప్పటికీ, ఇది ఐఫోన్, ఐప్యాడ్ మోడళ్లకు ప్రత్యేకమైన బిల్డ్‌లు అవసరం కావడం వల్ల అయి ఉండవచ్చు అని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గతంలో యాపిల్ విడుదల చేసిన విధానాలను పరిశీలిస్తే, ఐఓఎస్ 26.2 డిసెంబర్ 10 (బుధవారం) లేదా అక్కడి నుంచి కొన్ని రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో ఐఓఎస్ 18.2, ఐఓఎస్ 17.2 వంటి అప్‌డేట్‌లు కూడా ఇదే షెడ్యూల్‌ను అనుసరించి డిసెంబర్ రెండవ వారంలో విడుదలయ్యాయి.
యాపిల్ ఐఓఎస్ 26.2 కొత్త ఫీచర్లు, మెరుగుదలలు..
ఐఓఎస్ 26.2 లో కొత్త ఫీచర్స్..
యాపిల్ మ్యూజిక్: ఆఫ్‌లైన్ లిరిక్స్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా యూజర్లు పాటలు పాడుకోవడానికి వీలవుతుంది.
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు: ఏఐ- రూపొందించిన చాప్టర్లు అందుబాటులోకి రావచ్చు. దీనివల్ల వ్యూవర్స్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లలోని నిర్దిష్ట విభాగాలకు నేరుగా వెళ్లవచ్చు.
యాపిల్ న్యూస్: లేఅవుట్‌లో మార్పులు చేయడంతో ముఖ్యమైన కథనాలను సులభంగా గుర్తించి, చదవడానికి వీలవుతుంది.
రిమైండర్‌లు: కొత్త అలారం ఆప్షన్ ద్వారా టాస్క్ నోటిఫికేషన్‌లపై మరింత నియంత్రణ లభిస్తుంది.
ఫ్రీఫామ్: ఈ సహకార యాప్‌లో ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్‌ను మెరుగుపరచడానికి టేబుల్స్ (పట్టికలు) ఫీచర్ యాడ్ కావచ్చు.
లాక్ స్క్రీన్: లిక్విడ్ గ్లాస్ క్లాక్ ఎఫెక్ట్‌ను కస్టమైజ్ చేయడానికి విస్తృతమైన ఆప్షన్‌లు లభిస్తాయి.
ఎయిర్‌పాడ్స్: లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ యూరప్‌లో మరిన్ని భాషలకు అందుబాటులోకి రానుంది.
కార్ ప్లే: సిస్టమ్‌లో అప్‌గ్రేడ్స్ కారులోని వాడుక సౌలభ్యాన్ని పెంచుతాయి.
ఆర్సీ బిల్డ్ ఇప్పటికే అందుబాటులో ఉన్నందున, ఐఫోన్ వినియోగదారులు త్వరలోనే అధికారిక ఐఓఎస్ 26.2 విడుదలను ఆశించవచ్చు. ఈ అప్‌డేట్ ద్వారా మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఫంక్షనల్ అప్‌గ్రేడ్స్, పర్సనలైజ్ (Personalisation options) రానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


