Sign in

డిసెంబర్​ 25 : ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా?

క్రిస్మస్​ని పురస్కరించుకుని నేడు డిసెంబర్ 25 దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఇది సెలవుదినం. స్టాక్​ మార్కెట్​లకు కూడా నేడు సెలవు ఉంది.

Published on: Dec 25, 2025, 09:47:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిసెంబర్​ 25, గురువారం, నేడు క్రిస్మస్​. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కాగా క్రిస్మస్​ని పురస్కరించుకుని భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు నేడు సెలవు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ 25 దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.

ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా?
ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా అన్ని ప్రధాన బ్యాంకులు నేడు కార్యకలాపాలను నిలిపివేస్తాయి. డిసెంబర్ నెలలో మొత్తం 14 రోజులు సెలవుల కోటా ఉండగా, ఇప్పటికే మెజారిటీ సెలవులు ముగిశాయి.

డిసెంబర్‌లో మిగిలిన బ్యాంకు సెలవులు ఇవే

క్రిస్మస్ తర్వాత కూడా ఈ నెలలో మరో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆ వివరాలు..

డిసెంబర్ 26: క్రిస్మస్ వేడుకల కొనసాగింపుగా మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 27: నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

డిసెంబర్ 28: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.

డిసెంబర్ 30: 'యు కియాంగ్ నాంగ్‌బా' వర్ధంతి సందర్భంగా మేఘాలయలో సెలవు.

డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుకలు, 'ఇమోయిను ఇరాత్పా' సందర్భంగా మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో సెలవు.

ఇవి పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ సేవల పుణ్యమా అని దాదాపు అన్ని రకాల లావాదేవీలను మనం ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు.

నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.

యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ సేవలు సెలవు రోజుల్లో కూడా యథావిధిగా పనిచేస్తాయి. మొబైల్ యాప్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.

యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్‌ను జరుపుకుంటారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ ట్రీ అలంకరణలు, కానుకల ఇచ్చిపుచ్చుకోవడాలు, విందు వినోదాలతో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలో కూడా ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అందుకే దీనిని సెలవుదినంగా పరిగణిస్తారు.

స్టాక్​ మార్కెట్​లకు కూడా సెలవు..

బ్యాంకులే కాదు, క్రిస్మస్​ సందర్భంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు కూడా నెడు సెలవు ఉంది. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో మూతపడి ఉంటాయి. తిరిగి శుక్రవారం ఓపెన్​ అవుతాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఉంటాయి.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 116 పాయింట్లు పడి 85,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 35 పాయింట్లు కోల్పోయి 2,142 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 116 పాయింట్లు పడి 59,184 వద్దకు చేరింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More