Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 151 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

ఫిబ్రవరి 20, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 20, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1236 పాయింట్లు పడి 82,498 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 365 పాయింట్లు కోల్పోయి 25,454 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 811 పాయింట్లు పడి 60,740 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​, స్టాక్స్​ టు బై టుడే అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​, స్టాక్స్​ టు బై టుడే అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 880.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 596.28 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,076.63 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,474.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.54 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.28శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.31 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

యూపీఎల్​- బై రూ. 765, స్టాప్​ లాస్​ రూ. 738, టార్గెట్​ రూ. 820

బయోకాన్​- బై రూ. 383, స్టాప్​ లాస్​ రూ. 370, టార్గెట్​ రూ. 410

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​- బై రూ. 732, స్టాప్ లాస్​ రూ. 715, టార్గెట్​ రూ. 758​

ఫోర్టిస్​ హెల్త్​కేర్​- బై రూ. 906, స్టాప్​ లాస్​ రూ. 890, టార్గెట్​ రూ. 940

టాటా టెక్నాలజీస్​- బై రూ. 602, స్టాప్​ లాస్​ రూ. 590, టార్గెట్​ రూ. 635

సమ్మాన్​ క్యాపిటల్​- బై రూ. 151.35, స్టాప్​ లాస్​ రూ. 147, టార్గెట్​ రూ. 161

ఎంఎం ఫార్జింగ్​- బై రూ. 488.5, స్టాప్​ లాస్​ రూ. 478, టార్గెట్​ రూ. 520

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More