Sign in

Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- నేటి స్టాక్స్​ టు బై, బ్రేకౌట్ స్టాక్స్​ టు బై లిస్ట్ ఇదే..

Stock market : జూన్ 25, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 25, 2026, 08:14:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 791 పాయింట్లు పెరిగి 76,991 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 198 పాయింట్లు వృద్ధిచెంది 24,022 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 967 పాయింట్లు పెరిగి 58,150 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,843.40 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,637.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 24,150- 24,200 జోన్ కీలక రెసిస్టెన్స్​గా ఉంది. అది దాటితే సూచీ 24,500- 24,600 వరకు వెళ్లొచ్చు. ఇక 23,800 వద్ద కీలక సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.35 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.10శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.43 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు అమెరికా- ఇరాన్ యుద్ధం ముందు దశకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.54శాతం పడి బ్యారెల్​కి 73.34 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

గ్లాండ్ ఫార్మా- బై రూ. 2330, స్టాప్​ లాస్​ రూ .2180, టార్గెట్​ రూ. 23675

క్రెడిట్​యాక్సెస్ గ్రామీన్- బై రూ. 1465, స్టాప్​ లాస్​ రూ. 1380, టార్గెట్​ రూ. 1615

హింద్​పెట్రో- బై రూ. 414, స్టాప్​ లాస్​ రూ. 397, టార్గెట్​ రూ. 450

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్- బై రూ. 7698, స్టాప్​ లాస్​ రూ. 7380, టార్గెట్​ రూ. 8280

ఎన్​సీసీ- బై రూ. 157.50, స్టాప్​ లాస్​ రూ. 150, టర్గెట్​ రూ. 170

గ్లోబల్ హెల్త్ లిమిటెడ్- బై రూ. 1318, స్టాప్​ లాస్​ రూ .1265

రాడికో ఖైతాన్- బై రూ. 3758, స్టాప్​ లాస్​ రూ. 3550, టార్గెట్​ రూ. 4200

నెట్​వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 5074, స్టాప్​ లాస్​ రూ. 4865, టార్గెట్​ రూ. 5500

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More