Sign in

ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 230 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 17, 2025, 08:15:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 84 పాయింట్లు పెరిగి 84,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 31 పాయింట్లు వృద్ధిచెంది 25,910 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 136 పాయింట్లు పెరిగి 58,517 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,882.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,159.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 26000 లెవల్స్​ వద్ద కీలకమైన రెసిస్టెన్స్​ ఉంది. 25,700 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. ఈ రేంజ్​లో సూచీ కొనసాగినంత వరకు బుల్స్​కి ఆందోళనలు అవసరం లేదు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.65 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.05శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.13 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సిటీ యూనియన్​ బ్యాంక్​- బై రూ. 271, స్టాప్​ లాస్​ రూ. 262, టార్గెట్​ రూ. 290

గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​- బై రూ. 2897 ,స్టాప్​ లాస్​ రూ. 2795, టార్గెట్​ రూ. 3100

సెయిల్​- బై రూ. 142, స్టాప్​ లాస్​ రూ. 135, టార్గెట్​ రూ. 150

హుడ్​కో- బై రూ. 229, స్టాప్​ లాస్​ రూ. 223, టార్గెట్​ రూ. 240

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1373, స్టాప్​ లాస్​ రూ. 1350, టార్గెట్​ రూ. 1400

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

హెచ్ బీఎల్ ఇంజినీరింగ్: రూ.1041, టార్గెట్ రూ.1114, స్టాప్ లాస్ రూ.1005;

స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్ సర్న్ సిఎంపిఎన్ వై: రూ .523 వద్ద కొనండి, టార్గెట్ రూ .560, స్టాప్ లాస్ రూ .505;

డోమ్స్ ఇండస్ట్రీస్: రూ .2622 వద్ద కొనండి, లక్ష్యం రూ .2806, స్టాప్ లాస్ రూ .2530;

రాడికో ఖైతాన్: రూ .3260 వద్ద కొనండి, టార్గెట్ రూ .3490, స్టాప్ లాస్ రూ .3145;

విజయ డయాగ్నొస్టిక్ సెంటర్: రూ .1060 వద్ద కొనండి, టార్గెట్ రూ .1136, స్టాప్ లాస్ రూ .1022.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More