Sign in

Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ రూ. 78 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy today : ఏప్రిల్​ 27, 2026- ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 27, 2026, 08:14:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా- ఇరాన్​ మధ్య అనిశ్చితి నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 983 పాయింట్లు పడి 76,681 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు కోల్పోయి 23,898 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 215 పాయింట్లు పడి 56,090 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,828 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,701 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యే అవకాశం ఉంది. స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ వద్ద సరఫరా అనిశ్చితి కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బ్రెంట్​ క్రూడ్.. బ్యారెల్​కి​ 105- 108 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. మార్కెట్లను ఇబ్బంది పెడుతున్న అంశం ఇదే,” అని ఎన్​రిచ్​ మనీ సీఈఓ ఆర్​ పొన్ముడి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.16 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.80శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.6 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. బ్రెంట్​ క్రూడ్​ తాజాగా 2.05శాతం పెరిగి బ్యారెల్​కి 107.49 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

టాటా పవర్​- బై రూ. 433, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 442

సెయిల్​- బై రూ. 177, స్టాప్​ లాస్​ రూ. 174, టార్గెట్​ రూ. 182

టీసీఐ- బై రూ. 942, స్టాప్​ లాస్​ రూ. 930, టార్గెట్​ రూ. 965

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఇప్​కా లేబొరేటరీస్- బై రూ. 1555.90, స్టాప్​ లాస్​ రూ. 1484, టార్గెట్​ రూ. 1680

వరుణ్ బేవరేజెస్​- బై రూ. 490.45, స్టాప్​ లాస్​ రూ. 467, టార్గెట్​ రూ. 530

బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర- బై రూ. 77.9, స్టాప్​ లాస్​ రూ. 74.5, టార్గెట్​ రూ. 84.5

టిటాగర్​ రైల్​ సిస్టెమ్స్​- బై రూ. 756.2, స్టాప్​ లాస్​ రూ. 720, టార్గెట్​ రూ. 824

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More