పిల్లలకు భోగి పళ్ళు పోస్తున్నారా? కావాల్సిన సామాగ్రి, పాటించాల్సిన నియమాలు, కథ తెలుసుకోండి!
మొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇది ఎంతో ముచ్చటగా ఉంటుంది. పిల్లలకు భోగి పండ్లు పోయడం, పేరంటాళ్లను పిలిచి వాయినాలను ఇవ్వడం.. ఇలా ఎవరి పద్దతిని వారు పాటిస్తూ ఉంటారు. భోగి పండ్ల కథ గురించి, భోగి పండ్లు పోసే విధానం గురించి చూద్దాం.
భోగి పండుగ అంటే మొట్టమొదట మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పండ్లు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసేటప్పుడు పద్ధతిని పాటించాలి. చాలా మందికి భోగి పండుగ ఎలా పోయాలి? మొదట ఎవరు పొయ్యాలి అనే సందేహాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భోగి పండుగ 2026
తెలుగువారు ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా ఎదురు చూసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాల్గవ రోజు మొక్కల పండుగలను జరుపుకుంటాము. మొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు.
ఇది ఎంతో ముచ్చటగా, అందంగా ఉంటుంది. పిల్లలకు భోగి పండ్లు పోయడం, పేరంటాళ్లను పిలిచి వాయినాలను ఇవ్వడం.. ఇలా ఎవరి పద్దతిని వారు పాటిస్తూ ఉంటారు. అయితే భోగి పండ్ల కథ గురించి, భోగి పండ్లు పోసే విధానం గురించి చూద్దాం.
భోగి పండ్లకు కావలసిన సామాగ్రి
రేగి పండ్లు
బంతి పువ్వు రేకులు
చిల్లర కాసులు
చెరుకు ముక్కలు
వాయినానికి: సెనగలు, పండ్లు, వక్కలు, తమలపాకులు
భోగి పండ్లు పోయడానికి ముందు చిన్నారులకు హారతి ఇవ్వాలి. అందుకు కావలసిన సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోవాలి.
భోగి పండ్లు ఎలా పోయాలి?
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో రేగి పండ్లు వేయాలి. ఆ తర్వాత అందులోనే బంతి పువ్వు రేకులు, చిల్లర కాసులు, చెరుకు ముక్కలు వేయాలి. ముందు తల్లి కొన్ని పండ్లు తీసుకుని మూడు సార్లు సవ్య దిశలో, మరో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి, ఆ తర్వాత పిల్లల నెత్తి మీద పోయాలి. తర్వాత తండ్రి, మిగిలిన వారు కూడా తల్లి ఎలా అయితే మూడుసార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి పోసిందో అలాగే చేయాలి.
ఈ భోగి పండ్లు పోసేటప్పుడు “ఓం సారంగాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత వీటన్నిటినీ ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. లేదంటే నీటిలో వదిలిపెట్టాలి. ఈ పండ్లు తినడం వంటివి చేయకూడదు. పిల్లలకు దిష్టి తీశారు కనుక ఇవి తినడానికి పనికిరావు గుర్తుపెట్టుకోండి.
భోగి పండ్ల కథ
భోగి పండ్లు ఎందుకు పోయాలనే దాని గురించి మహాభారతంలోని ద్రోణ పర్వంలో చెప్పబడింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదరికావనంలో తపస్సు చేశారు. అప్పుడు శివుడు, “నీ తపస్సుకు మెచ్చి నన్ను కూడా జయించే శక్తిని నీకు ఇస్తున్నాను” అని వరం ఇచ్చాడు. విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలు సంతోషంతో నారాయణుడి తలపై బదరీ ఫలాలను కురిపించారు.
అప్పుడు ఆయన చిన్నపిల్లాడిలా మారిపోయాడు. అప్పటి నుంచి పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సంప్రదాయం ఏర్పడింది. రేగి పండ్లను భోగి పండ్లు అని అంటారు. వీటిని అర్కఫలం అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించేటప్పుడు ఆయన కరుణ పిల్లలపై ఉండాలని ఈ భోగి పండ్లు పోస్తారు. అలాగే ఈ భోగి పండ్లు పోయడం వలన పిల్లలకు ఆయురారోగ్యాలు కలుగుతాయని, వారిపై ఉన్న దిష్టి మొత్తం పోతుందని విశ్వాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


