తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల కుల డేటాను సేకరించనున్న బీసీ కమిషన్

బీసీ జనాభాలో ఏ ఉప కులాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించడానికి విద్యార్థుల కులం డేటాను సేకరించాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ విద్యా శాఖను కోరింది. ఈ మేరకు విద్యార్థుల వివరాలను సేకరించనున్నారు.

Published on: Feb 5, 2026, 10:29:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీసీ జనాభాలో ఏ ఉప కులాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించడానికి విద్యార్థుల కులంపై డేటాను సేకరించాలని విద్యా శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని కులాల వారిగా సేకరించే అంశంపైన బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బీసీ కమిషన్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మార్చి నాటికి డేటాను కమిషన్‌కు అందజేస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం నుండే అడ్మిషన్ల సమయంలో కుల సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కూడా తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థుల డేటాను సేకరించడంలో జాప్యం జరుగుతోందని, దీని ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించాలని బీసీ కమిషన్ చెప్పింది.

ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ అభిప్రాయపడింది.

సమావేశానికి వచ్చిన అదికారులు వెంటనే ఈ సమాచారాన్ని సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చూడతారని చెప్పారు. ఈ సంవత్సరం మార్చి లోపల వివరాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్‌లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి జరిగే ప్రవేశ పరిక్షలోనూ కుల సంబంధిత సమాచారాన్ని కూడా సేకరించబోతున్నట్టుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని అనుసరించి, తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరి 2024లో సమగ్ర కుల గణనను నిర్వహించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నవంబర్ 2024, 2025 ప్రారంభంలో నిర్వహించిన విస్తృత గృహ సర్వేలో, రాష్ట్ర జనాభాలో వెనకబడిన తరగతులు 56.33 శాతం ఉన్నారని వెల్లడించింది.

ఈ సర్వే రాష్ట్ర జనాభా వివరాలను అందించినప్పటికీ, విద్యా అసమానతలను పరిష్కరించడానికి సూక్ష్మమైన నిర్దిష్ట డేటా అవసరమని బీసీ కమిషన్ గుర్తించింది. అనేక బీసీ ఉప కులాలు అధికారిక రికార్డులలో అదృశ్యంగా ఉన్నాయి. దీని ఫలితంగా స్కాలర్‌షిప్‌లు, సీట్ల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More