Karthika Deepam 2: కార్తీకదీపం 2లో బిగ్ ట్విస్ట్-మరో 500 ఎపిసోడ్ల ప్లాన్-కొత్త క్యారెక్టర్ల ఎంట్రీ-సూరజ్ అసలు కథ ఇదేనా?

Karthika Deepam 2: తెలుగు బుల్లితెరపై తిరుగులేని టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ లో ట్విస్ట్ లు మామూలుగా లేవు. కథను మరో 500 ఎపిసోడ్ల పాటు విజయవంతంగా లాగడానికి మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా కొత్త క్యారెక్టర్లు, సూరజ్ సీక్రెట్ గురించి ఓ లుక్కేద్దాం.

Published on: Jul 8, 2026, 11:46:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2: తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే ఒక సంచలనం సృష్టించిన సీరియల్ ‘కార్తీక దీపం’. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తీక దీపం 2’ కూడా అదే రేంజ్ క్రేజ్‌తో దూసుకుపోతోంది. దీప, కార్తీక్‌ల లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టేస్తోంది. అయితే, కేవలం రొటీన్ ట్రాక్‌తో బోర్ కొట్టించకుండా, ఈ సీరియల్ రేంజ్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ ఇప్పుడు కథను పూర్తిగా మార్చేస్తున్నారు.

కార్తీక దీపం 2 సీరియల్ లో ట్విస్ట్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ లో ట్విస్ట్ (jiohotstar)

కార్తీక దీపం 2లో కొత్త క్యారెక్టర్లు

బుల్లితెర ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. కార్తీక దీపం 2 సీరియల్‌ను మరో 500 ఎపిసోడ్ల పాటు పొడిగించేలా సరికొత్త క్యారెక్టర్లను మేకర్స్ రంగంలోకి దించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో Karthika Deepam 2 today episode update కోసం వెతుకుతున్న ఫ్యాన్స్‌కు ఈ కొత్త ట్విస్ట్‌లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

కథను మలుపు తిప్పే ఆ ముగ్గురు

ఈ ప్రెస్టీజియస్ కార్తీక దీపం 2 సీరియల్‌లోకి ఇటీవల మూడు కీలక పాత్రలు ఎంట్రీ ఇచ్చాయి. మొదట దక్షిణామూర్తి, ఆ తర్వాత సూరజ్, తాజాగా మాలిని క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ప్రస్తుతం ఆడియన్స్‌ను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. "అసలు ఈ సూరజ్ ఎవరు?" అనేది.

దక్షిణామూర్తి కోడలు

కార్తీక దీపం 2 సీరియల్ కథ ప్రకారం.. మాలిని అనే క్యారెక్టర్ దక్షిణామూర్తికి కోడలిగా రివీల్ అయింది. కానీ సూరజ్ పాత్రను మాత్రం మేకర్స్ అత్యంత సీక్రెట్‌గా ఉంచారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణామూర్తికి సూరజ్ మనవడు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే అతను మాలిని కొడుకు అవొచ్చు.

ఈ రెండు రిలేషన్స్ తో కథను ఇంట్రెస్టింగ్ మార్చబోతున్నారని టాక్. దీని చుట్టూ రాబోయే 500 ఎపిసోడ్ల హై-వోల్టేజ్ డ్రామా నడవబోతోందని తెలుస్తోంది. కేవలం సాధారణ అప్‌డేట్స్ కోసం చూసే వారికి ఇది ఒక షాకింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి.

దీప, కార్తీక్‌లకు తప్పని కొత్త కష్టాలు!

కార్తీక దీపం 2 సీరియల్ లో ఈ మూడు కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో సీరియల్‌లో విలనిజం, సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనున్నాయి. దక్షిణామూర్తి, మాలిని, సూరజ్ కలిసి దీప (Deepa), కార్తీక్ (Karthik) జీవితాల్లో ఎలాంటి తుఫాన్ సృష్టించబోతున్నారనే పాయింట్‌పైనే సరికొత్త కథాంశాన్ని అల్లారని తెలిసింది.

టాలీవుడ్ మిడ్-టైర్ సినిమాలకు వచ్చే కలెక్షన్లతో సమానంగా యాడ్ రెవెన్యూ రాబట్టే సత్తా ఉన్న కార్తీక దీపం 2 సీరియల్ కు ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక కొత్త క్యారెక్టర్లతో అది పీక్స్ కు చేరనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More