Sign in

Sing Geetham OTT: పెద్దితో పోటీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మ్యూజికల్ ఫాంటసీ మూవీ.. 94 ఏళ్ల దర్శకుడి అద్భుత సృష్టి!

Sing Geetham OTT: తెలుగు సినిమానే కాదు మొత్తం ప్రపంచ మూవీ చరిత్రలోనే స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం ‘సింగ్ గీతం’. కేవలం పాటలే డైలాగ్ లుగా 94 ఏళ్ల లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తీసిన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ లో రామ్ చరణ్ పెద్దితో పోటీపడనుంది.

Published on: Jul 5, 2026, 16:08:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sing Geetham OTT: భారతీయ చలనచిత్ర రంగంలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, మూకీ సినిమాలను పరిచయం చేసిన ఘనత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకే దక్కుతుంది. ఆయన వయసుతో నిమిత్తం లేకుండా 94 ఏళ్ల వయసులో చేసిన తాజా అద్భుత ప్రయోగమే ‘సింగ్ గీతం’. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

పెద్దితో పోటీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మ్యూజికల్ ఫాంటసీ మూవీ (x/SwapnaCinema)
పెద్దితో పోటీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మ్యూజికల్ ఫాంటసీ మూవీ (x/SwapnaCinema)

సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ డేట్

మ్యూజికల్ ఫాంటసీ మూవీగా, ఓ విభిన్నమైన ప్రయోగంతో వచ్చిన ‘సింగ్ గీతం’ చిత్రం ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ డిఫరెంట్ మూవీ జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. అదే రోజు ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

4 భాషల్లో గ్రాండ్ ఎంట్రీ

సింగ్ గీతం చిత్రం థియేటర్లలో కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ పరిధిని పెంచింది. జూలై 9 నుంచి ఒరిజినల్ వెర్షన్లతో పాటు కన్నడ, మలయాళ భాషల ఆడియోలను కూడా జత చేసి మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు.

అయాన్, అహిల్యా బమ్రూ జంటగా నటించిన ఈ చిత్రంలో శాలిని కొండెపూడి, నివేదా పేతురాజ్, శివన్నారాయణ, బెనర్జీ, తులసి కీలక పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మ్యూజికల్ ఫిల్మ్‌కు ప్రాణంగా నిలిచింది.

పెద్దితో పోటీ

సింగ్ గీతం మూవీ ఓటీటీలో రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీ పడనుంది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది మూవీ కూడా జూలై 9న అదే నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఓ రూరల్ స్పోర్ట్స్ పర్సన్ స్టోరీ లైన్ తో పెద్ది మూవీ తెరకెక్కింది.

సింగ్ గీతం స్టోరీ

సింగ్ గీతం సినిమా కథాంశం ప్రకారం.. ఒక మారుమూల గ్రామంలో ఒక వింతైన, అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఊరి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ ఉన్నవారంతా తమ జీవితంలోని ప్రతి భావోద్వేగాన్ని (బాధ, సంతోషం, కోపం, ప్రేమ) కేవలం పాటల రూపంలోనే వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక అరుదైన మ్యూజికల్ ఫాంటసీ డ్రామాను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేదు.

ఓటీటీ వెర్షన్‌లో మార్పులు

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి నిర్మాత నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ పంచుకున్నాడు. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ మరింత మెరుగ్గా ఉండబోతోందని ఇప్పటికే తెలిపాడు.హోమ్ ఆడియన్స్‌కు బెస్ట్ విజువల్ అండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం డిజిటల్ వెర్షన్‌లో కొన్ని సాంకేతిక మార్పులు, కలర్ కరెక్షన్ ఎడిట్స్ చేసినట్లు వెల్లడించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More