Amazon Prime Day Sale : రేపటి నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్- ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై సూపర్ డిస్కౌంట్స్..
Amazon Sale 2026 : భారతదేశంలో ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 జులై 4 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్, నథింగ్, ఐక్యూ, రెడ్‌మీ వంటి పాపులర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై లభించే బెస్ట్ డీల్స్ వివరాలు మీకోసం.
ఆన్‌లైన్ షాపర్లకు అమెజాన్ అదిరిపోయే వార్త మోసుకొచ్చింది. భారత్‌లో ప్రైమ్ మెంబర్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026' జులై 4 (శనివారం) అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ మూడు రోజుల షాపింగ్ పండగ జులై 6 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రారంభమై విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ 10వ ఎడిషన్‌లో స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. సేల్ ప్రారంభానికి ముందే కొన్ని పాపులర్ మొబైల్ బ్రాండ్లపై లభించే క్రేజీ డీల్స్‌ను అమెజాన్ లీక్ చేసింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్- సగం ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు!
ఈ ఏడాది సేల్‌లో సరికొత్త మోడళ్లతో పాటు గత ఏడాది విడుదలైన పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి. ముఖ్యంగా శాంసంగ్, నథింగ్ బ్రాండ్ లవర్స్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
శాంసంగ్ గెలాక్సీ ఏ56 5జీ : మార్కెట్లో దీని అసలు ధర రూ. 49,999 కాగా, ఈ ప్రైమ్ డే సేల్‌లో ఏకంగా రూ. 31,999 ల్యాండింగ్ ప్రైస్‌కే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3 : నథింగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లీడింగ్ ఫోన్ ఇది. దీని లాంచ్ ధర రూ. 79,999 కాగా, ఈ సేల్‌లో ఏకంగా సగానికి పైగా రేటు తగ్గి రూ. 41,999 కే లభించనుంది.
వీటితో పాటు ఐక్యూ, రెడ్‌మీకి చెందిన పలు మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు అత్యంత చౌక ధరలకే అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్- బ్యాంక్ ఆఫర్లు..
కేవలం ఫ్లాట్ డిస్కౌంట్లే కాకుండా కస్టమర్ల కోసం అమెజాన్ అదనపు ఆర్థిక ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. షాపింగ్ చేసే సమయంలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డలను ఉపయోగించే వారికి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ‘అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్’ యూజర్లకు ప్రతి అర్హత కలిగిన పర్చేజ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్- ఎక్స్ఛేంజ్ బోనస్..
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా కొత్త ఫోన్ కొనాలనుకునే వారు తమ పాత ఫోన్‌ను మార్చుకునేందుకు వీలుగా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ప్రవేశపెట్టారు. జేబు నుంచి ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై అదనపు కూపన్ ఆధారిత డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. మెట్రో నగరాలు, ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేసే 'సేమ్ డే డెలివరీ' సదుపాయాన్ని కూడా ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే ఆఫర్లు..
| స్మార్ట్‌ఫోన్ పేరు | సేల్‌లో ధర | లాంట్ నాటి ధర |
|---|---|---|
| ఐక్యూ నియో 10 (8జీబీ+256జీబీ) | రూ. 41,999 | రూ. 45,999 |
| రెడ్‌మీ టర్పో 5 (12జీబీ+256జీబీ) | రూ. 40,999 | రూ. 57,999 |
| నథింగ్ ఫోన్ 3 (12జీబీ+256జీబీ) | రూ. 41,999 | రూ. 79,999 |
| వన్‌ప్లస్ 13ఎస్ (12జీబీ+256జీబీ) | రూ. 49,999 | రూ. 57,999 |
| వన్‌ప్లస్ నార్డ్ 6 | రూ. 39,999 | రూ. 52,999 |
| శాంసంగ్ గెలాక్సీ ఏ56 | రూ. 31,999 | రూ. 49,999 |
| రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5జీ | రూ. 37,999 | రూ. 39,999 |
మరీ వీటిల్లో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


