Israel Iran War : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య కూడా మృతి.. ఇజ్రాయెల్ దాడిలో గాయపడి..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందారు. ఆమె కూడా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శనివారం (ఫిబ్రవరి 28) ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. రెండు రోజుల తరువాత సోమవారం ఖమేనీ భార్య కూడా మరణించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. దాడి తర్వాత ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా పలువురు ప్రముఖ నాయకులు, అధికారులు ఇజ్రాయెల్-అమెరికన్ సంయుక్త వైమానిక దాడిలో మరణించారు. ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఖమేనీ మరణం తర్వాత అతని భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే మరణ వార్త కూడా తాజాగా వెలువడింది. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. ఇరాన్ మీడియా సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారు. ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందింది అయితే పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది.
నివేదికల ప్రకారం, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే 1964లో వివాహం చేసుకున్నారు. ఖమేనీ భార్య ప్రజా జీవితానికి దూరంగా ఉండేవారు. ఎక్కవగా బయటకు వచ్చేవారు కాదు. అందుకే ఆమె గురించి చాలా తక్కువగా తెలుసు. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు కుమారు, ఇద్దరు కుమార్తెలు.
మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే తండ్రి పేరు మహ్మద్ ఇస్మాయిల్ ఖోజస్తే బగెర్జాదే. మషాద్‌లో వ్యాపారాలు చేస్తుండేవారు. ఇక మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే సోదరుడు హసన్.. ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.
ఖమేనీ బంధువులు, ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కూడా ఈ దాడుల్లో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. దాడుల తర్వాత సుప్రీం లీడర్ కుటుంబంలో మరణాలు జరిగాయని ఇరాన్ మీడియా ధృవీకరించింది. సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సభ్యులను కోల్పోవడం టెహ్రాన్ నాయకత్వంపై అంతర్గత ఒత్తిడిని పెంచుతుందని, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దేశంపై ఏవైనా దాడులు జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఆ వైపుగానే దాడులు కూడా జరుగుతున్నాయి.
ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం, ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి కనీసం 555 మంది ఇరానీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో 130కి పైగా నగరాలపై దాడులు జరిగాయని కూడా అది పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్.. ఇరానియన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నావికాదళంపై బాంబు దాడి చేశాయి. అదే సమయంలో దాని అనేక యుద్ధనౌకలు ధ్వంసమయ్యాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


