Stocks to buy : ఫిబ్రవరి 16, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​..

ఫిబ్రవరి 16, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 16, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1046 పాయింట్లు పడి 82,627 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 336 పాయింట్లు కోల్పోయి 25,471 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 553 పాయింట్లు పడి 60,187 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఏఐతో ఐటీ కంపెనీలకు నష్టం కలుగుతుందని, ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతారని ప్రస్తుతం మార్కెట్​లో చాలా భయాలు ఉన్నాయి. అందుకే ఐటీ ఇండెక్స్​తో పాటు ఐటీ షేర్లు గత కొన్ని రోజులుగా పతనం అవుతున్నాయి. శుక్రవారం భారీ నష్టాలకు ఇది ఒక కారణం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,395.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,553.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,373.56 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,775.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్ స్వల్ప​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 ఇంట్రాడే స్ట్రక్చర్​ నెగిటివ్​గా ఉంది. కానీ 25,400 లెవల్స్​ కన్నా దిగువకు పడితేనే సూచీలో మరింత కరెక్షన్​ కనిపించవచ్చు. అది బ్రేక్​ అయితే సూచీ 25,300 వరకు వెళుతుంది. అది కూడా బ్రేక్​ అయితే 25,150కి వెళ్లొచ్చు. 25,600 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ఉంది,” అని కొటాక్​ సెక్యూరిటీస్​కి చెందిన వీపీ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ అమోల్​ అథవాలే తెెలిపారు.

అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.10 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.05శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ మాత్రం 0.22 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

బంగారం, వెండి ధరలు..

సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్పాట్​ గోల్డ్​ 0.27శాతం పడి ఔన్సుకు 5033 డాలర్లకు చేరింది. ఇక స్పాడ్​ సిల్వర్​ 2.08శాతం మేర పతనమై ఔన్సుకు 76.34 డాలర్లకు వెళ్లింది.

ఈ పతనానికి ప్రాఫిట్​ బుకింగ్​ కారణమని నిపుణులు చెబుతున్నారు.

స్టాక్స్​ టు బై..

సినైడర్​ ఎలక్ట్రిక్​- బై రూ. 811.7, స్టాప్​ లాస్​ రూ. 776, టార్గెట్​ రూ. 884

బ్లూ స్టార్​- బై రూ. 1997.2, స్టాప్​ లాస్​ రూ. 1933, టార్గెట్​ రూ. 2130

బజాజ్​ ఫైనాన్స్​- బై రూ.1025, స్టాప్​ లాస్​ రూ. 1010, టార్గెట్​ రూ. 1060

సెయిల్​- బై రూ. 159, స్టాప్​ లాస్​ రూ. 154, టార్గెట్​ రూ. 166

ఎస్బీఐ లైఫ్​- బై రూ. 2035, స్టాప్​ లాస్​ రూ. 1980, టార్గెట్​ రూ. 2100

ఏబీఎఫ్​ఆర్​ఎల్​- బై రూ. 73.80, స్టాప్​ లాస్​ రూ. 71, టార్గెట్​ రూ. 80

కిర్లోస్కర్​ ఆయిల్​ ఇంజిన్స్​- బై రూ. 1379, స్టాప్​ లాస్​ రూ. 1350, టార్గెట్​ రూ. 1450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)