Stocks to buy : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ చేయాలి?

ఫిబ్రవరి 19, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 19, 2026 8:16 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 283 పాయింట్లు పెరిగి 83,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 377 పాయింట్లు పెరిగి 61,551 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,125.01 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 360.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ సపోర్ట్​ అనేది 25,500 నుంచి 25,600కి వెళ్లింది. దానిపైన కొనసాగినంత వరకు నిఫ్టీ50 పాజిటివ్​గా ఉన్నట్టు. 25,950- 26,000 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ ఈక్వీటీ రీసెర్చ్​ హెడ్​ శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.26 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.56శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.78 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​- బై రూ. 1022.05, స్టాప్​ లాస్​ రూ. 980, టార్గెట్​ రూ. 1100

రిలయన్స్​ ఇండస్ట్రీస్​- బై రూ. 1442, స్టాప్​ లాస్​ రూ. 1405, టార్గెట్​ రూ. 1485

టాటా టెక్నాలజీస్​- బై రూ. 603, స్టాప్​ లాస్​ రూ. 590, టార్గెట్​ రూ. 642

ఎటర్నల్​- బై రూ. 277, స్టాప్​ లాస్​ రూ. 270, టార్గెట్​ రూ. 295

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సెనోరెస్​ ఫార్మా- బై రూ. 822, స్టాప్​ లాస్​ రూ. 788, టార్గెట్​ రూ. 875

ఎల్గీ ఎక్విప్​మెంట్స్​- బై రూ. 537, స్టాప్​ లాస్​ రూ. 515, టార్గెట్​ రూ. 575

లుమాక్స్​ ఆటో టెక్నాలజీస్​- బై రూ. 1691, స్టాప్​ లాస్​ రూ. 1620, టార్గెట్​ రూ. 1815

యాక్టువాస్​ కెమికల్స్​- బై రూ. 2143, స్టాప్​ లాస్​ రూ. 20175, టార్గెట్​ రూ. 2232

ఆజాద్​ ఇంజినీరింగ్​- బై రూ. 1717, స్టాప్​ లాస్​ రూ. 1645, టార్గెట్​ రూ. 1900

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More