Sign in

Yogini Ekadashi 2026 : యోగిని ఏకాదశి కథ.. రెండే రెండు నిమిషాల్లో చదివేయండి

Yogini Ekadashi 2026 : హిందూ మతంలో యోగిని ఏకాదశి వ్రతం చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. జులై 10న యోగిని ఏకాదశి వచ్చింది. ఈ రోజున వ్రతం పాటించి, విష్ణుమూర్తి కథలను వినేవారి కోరికలన్నీకోరికలన్నీ నెరవేరుతాయని అంటారు.

Updated on: Jul 10, 2026, 08:50:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూమతంలో ప్రతి నెల ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ యోగిని ఏకాదశి అత్యంత ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల వేలాది మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందువల్ల ఈ ఏకాదశి నాడు కథ వినడం, ఉపవాసం పాటించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ వ్రత కథను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించాడు. ఆ కథేంటో మీరు చదవండి.

యోగిని ఏకాదశి 2026
యోగిని ఏకాదశి 2026

స్వర్గంలో అలకాపురి అనే అందమైన నగరం ఉండేది, దానిని కుబేరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను శివ భగవానుడికి గొప్ప భక్తుడు. హేముడు అనే తోటమాలి రోజువారీ పూజ కోసం పువ్వులు తెచ్చేవాడు. హేముని భార్య విశాలాక్షి చాలా అందంగా ఉండేది, అతను ఆమెను గాఢంగా ప్రేమించేవాడు.

ఒక రోజు హేముడు మానస సరోవరం నుండి పువ్వులు తెచ్చాడు. కానీ తన భార్య ప్రేమలో ఎంతగా మునిగిపోయాడంటే, వాటిని పూజ సమయానికి అందించలేకపోయాడు. ఈ విషయం కుబేరుడికి తెలియగానే, అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. అతను హేముడిని శపిస్తూ, అతను తన భార్య నుండి విడిపోయి భూలోకంలో కుష్ఠురోగిగా జీవిస్తాడని శాపం ఇచ్చాడు.

శాపం ప్రభావంతో హేముడు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ వెంటనే స్వర్గం నుండి భూమి మీదకు పడిపోయాడు. అతని భార్య కూడా అతనికి దూరమైంది. చాలా కాలం బాధపడ్డాడు.. కానీ తన పూర్వజన్మలోని సంఘటనలు వెంటాడుతూ ఉండేవి. ఒక రోజు అలాగే సంచరిస్తూ.. అతను మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. పరిస్థితిని చూసిన ఆ మహర్షి కారణం అడగ్గా, హేముడు తన పూర్తి కథను ఆయనకు చెప్పాడు.

అతని దుస్థితిని విన్న మార్కండేయ మహర్షి, హేముడికి యోగిని ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు. పూర్తి క్రతువులతో ఆ వ్రతాన్ని ఆచరించాడు హేముడు. దాని ఫలితంగా శాపం తొలగిపోయి, అతను తన అసలు రూపాన్ని తిరిగి పొంది, తన భార్యతో సుఖంగా జీవించాడు. అందుకే యోగిని ఏకాదశిని పాపాల నుండి విముక్తి కలిగించి, సుఖసంతోషాలను ప్రసాదించే వ్రతంగా పరిగణిస్తారు.

యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, ఉపవాసం ఉంటారు. అనంతరం మీ పూజా స్థలంలో ఒక కలశాన్ని ప్రతిష్ఠించి, దానిపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచండి . భక్తిశ్రద్ధలతో దేవునికి పువ్వులు, పండ్లు సమర్పించి, దీపం వెలిగించి, హారతి ఇవ్వండి. బెల్లం, శనగలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆచారం మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకువచ్చి, లక్ష్మీదేవి ఆశీస్సులను అందిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More