మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్.. మీ ఏరియా ఏ జోన్ కిందకు వస్తుందో ఇక్కడ చూడండి?

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. అయితే మీ ఏరియా ఏ కార్పొరేషన్‌లో ఏ సర్కిల్ కిందకు వస్తుందో ఇక్కడ చూసుకోండి.

Published on: Feb 11, 2026, 18:01:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)ని మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ). పరిపాలనా సౌలభ్యం కోసం విభజన చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ

గత సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. పరిధిని 650 చదరపు కిలోమీటర్ల నుండి 2,053 చదరపు కిలోమీటర్లకు పెంచారు. దీనితో మెగాసిటీగా మారింది. ఇప్పుడు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను 60 సర్కిళ్లుగా విభజించారు. అవి ఏంటో ఇక్కడ చూడండి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

సెంట్రల్ అండ్ సౌత్ హైదరాబాద్. జీహెచ్ఎంసీ ఇప్పుడు 6 జోన్లు, 30 సర్కిల్‌లను కలిగి ఉంటుంది. ఇవి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లను కవర్ చేస్తాయి.

శంషాబాద్ జోన్: ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్పల్లి, శంషాబాద్

చార్మినార్ జోన్: సంతోష్ నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్

ఖైరతాబాద్ జోన్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట

రాజేంద్రనగర్ జోన్: రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్ పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్

గోల్కొండ జోన్: గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్

సికింద్రాబాద్ జోన్: కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

పశ్చిమ హైదరాబాద్‌లోని ఎక్కువ భాగం ప్లస్ ఉత్తర హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు. సైబరాబాద్‌లో 3 జోన్‌లు, 16 సర్కిల్‌లు ఉంటాయి.

శేరిలింగంపల్లి జోన్: నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి

కూకట్‌పల్లి జోన్: మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్

కుత్బుల్లాపూర్ జోన్: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్

తూర్పు అండ్ ఉత్తర హైదరాబాద్‌లోని ఎక్కువ భాగం. మల్కాజ్‌గిరి 3 జోన్‌లు, 14 సర్కిల్‌లను కలిగి ఉంటుంది.

మల్కాజిగిరి జోన్: కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలా అలీ, మల్కాజిగిరి

ఉప్పల్ జోన్: ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్

ఎల్‌బీనగర్ జోన్: నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్‌వీ కర్ణన్ జీహెచ్‌ఎంసి కమిషనర్‌గానే కొనసాగుతున్నారు. జి.సృజన సైబరాబాద్ కొత్త కమిషనర్‌గా, టి.వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్నారు. జయేష్ రంజన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More