ఈ మ‌ల‌యాళ సినిమా ఓ మాస్ట‌ర్‌పీస్‌-ఆమె న‌ట‌న‌కు అత్యున్న‌త గౌర‌వం ద‌క్కాలి-ధ‌నుష్ మెచ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఈ ఓటీటీలోనే

తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఓ మలయాళ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను మాస్టర్ పీస్ అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఇందులో కీలక పాత్ర పోషించిన ఓ నటికి అత్యున్నత గౌరవం దక్కాల్సిందేనని అన్నారు. మరి ఈ సినిమా ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో చూసేయండి. 

Published on: Jan 14, 2026 5:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ మూవీపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు. ఇదో మాస్టర్ పీస్ అంటూ తన రివ్యూను పోస్టు చేశారు. ఎకో చిత్రంలో కీలక పాత్ర పోషించిన బయానా మోమిన్ నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మీరు ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

మలయాళ సినిమాపై ధనుష్ రివ్యూ
మలయాళ సినిమాపై ధనుష్ రివ్యూ

ధనుష్ రివ్యూ

స్టార్ హీరో ధనుష్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఎకోపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. 'ఎకో'ను 'మాస్టర్‌పీస్'గా అభివర్ణించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ హీరో ఎకో సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి బయానా మోమిన్ నటనను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘మలయాళ చిత్రం 'ఎకో' ఒక మాస్టర్‌పీస్. నటి బయానా మోమిన్ అన్ని అత్యున్నత గౌరవాలకు అర్హురాలు. ప్రపంచ స్థాయి నటన’’ అని ఎక్స్ లో ధనుష్ పోస్టు చేశారు.

ఎకో ఓటీటీ

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఎకో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ చిత్రం 'ఎకో' విమర్శకుల ప్రశంసలతో పాటు ఆర్థికంగానూ విజయదుందుభి మోగించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు దింజిత్ అయ్యథన్ దర్శకత్వం వహించారు. 'కిష్కింధ కాండం', 'కేరళ క్రైమ్ ఫైల్స్: సీజన్ 2' తర్వాత 'ఎకో' అతని 'యానిమల్ ట్రిలజీ'కి చివరి అధ్యాయం.

ఫస్ట్ మూవీ

బయానా మోమిన్ ఈ ఎకో చిత్రంలో మ్లాతి చెత్తతి పాత్ర పోషించారు. ఆమె కురియాచన్ భార్య. వివాహం తర్వాత కేరళకు వచ్చి కొండల్లో నివసిస్తుంది. ఆమె పాత్ర చిత్రంలోని కీలక మిస్టరీని ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 'ఎకో' మూవీ బయానాకి నటనలో తొలి అడుగు. ఆమె మేఘాలయకు చెందిన టీచర్. బయానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ధనుష్ ప్రశంసలను పంచుకున్నారు.

చాలా విలువైంది

ధనుష్ రివ్యూపై ఎకో డైరెక్టర్ దింజిత్ సంతోషం వ్యక్తం చేశారు. ధనుష్ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి.. ‘‘మన చిత్రాన్ని మాస్టర్‌పీస్‌గా అభివర్ణించినందుకు ధనుష్ సర్‌ పట్ల చాలా గౌరవంగా, కృతజ్ఞతగా ఉంది. ఇది మనందరికీ చాలా విలువైనది’’ అని తెలిపారు.

ఎకో గురించి

ఎకో కథను బహుల్ రమేష్ రాశారు. హిట్ మూవీ 'కిష్కింధ కాండం' తర్వాత బహుల్, దింజిత్ మళ్లీ కలిసి పనిచేసిన చిత్రం ఇది. ఇందులో సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ కూడా నటించారు. ఈ చిత్రం ఒక వృద్ధురాలు, ఆమె సంరక్షకులు కాట్టుకున్నులోని మంచు కొండలలో గతాన్ని ఎదుర్కొనే కథను ఇది చెబుతుంది. అయితే కురియాచన్ (సౌరభ్) అనే కుక్కల పెంపకందారుడు, పరారీలో ఉన్న వ్యక్తిని వేటాడుతున్నారు.

మ్లాతి చెత్తతి, పీయూష్ (సందీప్) కొండల్లోకి అతన్ని వెతుక్కుంటూ వచ్చిన అపరిచితులుగా నిజాలను వెలికితీస్తారు. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్కును దాటింది. దీని బడ్జెట్ కేవం రూ.5 కోట్లు మాత్రమే. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించడానికి అందుబాటులో ఉంది.