Sign in

Illu Illalu Pillalu April 22 Episode: వల్లి మరో డ్రామా.. చందుతో విడాకులు.. కథలో ట్విస్ట్.. చిక్కిన లారీ డ్రైవర్

Illu Illalu Pillalu April 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వల్లిని ఇంటికి తీసుకురమ్మని చందుకు ప్రేమ, నర్మద, ధీరజ్ చెప్తారు. కాఫీ కప్పులు కడుగుతూ వల్లి మరో డ్రామా ప్లే చేస్తుంది. లారీ డ్రైవర్ ను ధీరజ్, నర్మద పట్టుకుంటారు.

Published on: Apr 22, 2026, 07:36:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో.. వల్లి అక్క గురించి ప్రేమ అడిగితే చందు సీరియస్ అవుతాడు. అమూల్య విషయంలో వల్లి చేసింది తలుచుకుని, ఆ దెయ్యం గురించి మాట్లాడొద్దని ఆల్రెడీ చెప్పాను కదా అని చందు అంటాడు. వాళ్ల అమ్మ మాటలు విని వల్లి అక్క అలా ప్రవర్తిస్తుందని నర్మద చెప్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

చందు సీరియస్

మనిషికి, పశువుకు మధ్య ఉండే తేడా విచక్షణ. వాళ్ల అమ్మ చెప్పినంత మాత్రాన బావిలో దూకేయమంటే దూకేస్తుందా? ఏది మంచో, ఏది చెడో తెలియాలి కదా అని చందు సీరియస్ గానే అంటాడు. మీలాగే వల్లి అక్క కూడా బాధపడుతుంది. తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుందని ప్రేమ చెప్తుంది. తన తప్పును క్షమించి వల్లి అక్కను తీసుకురండని నర్మద అడుగుతుంది.

ధీరజ్ రిక్వెస్ట్

విశ్వతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన విషయంలో మాత్రం వల్లిని అసలు క్షమించను. మా నాన్న హార్ట్ ఎటాక్ తో చావు దగ్గర వరకూ వెళ్లి వచ్చాడని చందు గతం గుర్తు చేస్తాడు. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా వదినకు గట్టిగా చెప్పి, వీలైనంత త్వరగా ఇంటికి తీసుకు రా అని చందును ధీరజ్ కూడా అడుగుతాడు. చందు లోపలికి వెళ్లిపోతాడు.

ప్రేమకు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ఏ ఏరియాలో ఉన్నాడో ధీరజ్ ఫోన్లో తెలుస్తుంది. ధీరజ్, నర్మద బైక్ పై అక్కడికి వెళ్తారు. ఆ లారీ డ్రైవర్ ఏమో టీ తాగి, దమ్ము కొట్టాలని బయటకు వస్తాడు. లారీ డ్రైవర్ ను పట్టుకునేందుకు ఎంతసేపైనా వెయిట్ చేద్దామని ధీరజ్, నర్మద అనుకుంటారు.

శ్రీవల్లి మరో ప్లాన్

మరోవైపు పక్కనే శ్రీవల్లికి భాగ్యం మరో ప్లాన్ చెప్తుంది. వల్లిని కాఫీ కప్పులు కడగమని భాగ్యం చెప్తుంది. ప్రేమ, నర్మదలను బతిమిలాడుకుంటే నా మీద జాలిపడి ఒప్పుకొన్నారు. కానీ నువ్వు ఛాలెంజింగ్ చేసి బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టేశావు. నువ్వు గొడవ పెట్టుకోకపోయి ఉంటే ఇప్పటికే అత్తారింట్లో ఉండేదాన్ని అని తల్లిపై వల్లి ఫైర్ అవుతుంది. నువ్వు వాళ్ల కాళ్లు పట్టుకుంటే జీవితాంతం నిన్ను ఆడుకునేవాళ్లని భాగ్యం చెప్తుంది.

స్కామ్ వేశారని

నువ్వు కాఫీ కప్పులు కడగడం చూసి అల్లుడు షాక్ అవుతాడు. రామరాజు కోడలు ఇలా చేయడం ఎవరైనా చూస్తే పరువుకు డ్యామేజింగ్ అని ఫీల్ అవుతాడు. నిన్ను ఇంటికి పట్టుకెళ్లిపోతాడని భాగ్యం క్లియర్ గా వివరిస్తుంది. తల్లి చెప్పడంతో వల్లి కప్పులు కడుగుతుంది. అది ధీరజ్, నర్మద చూస్తారు. వల్లి వదిన కాఫీ కప్పులు కడగడం ఏంటీ? చాలా బాధగా ఉందని ధీరజ్ అంటాడు. కానీ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను చూసిన నర్మద ఏదో స్కామ్ వేశారని చెప్తుంది.

భాగ్యం, ఇడ్లీ యాక్టింగ్

అప్పుడే అక్కడికి చందు వస్తాడు. వల్లిని చూస్తాడు. ఏ ఏంటే ఇది? హోటల్లో కప్పులు కడిగి మా నాన్న పరువు తీయాలని అనుకుంటున్నావా? ఇది మా నాన్నకు ఎంత పరువు తక్కువ. మా నాన్నను నానా మాటలు అనిపించేందుకు ఇలా చేస్తున్నావా? అని వల్లిపై చందు సీరియస్ అవుతాడు. మమ్మల్ని పోషించేందుకు మా అమ్మడు ఈ పనిలో చేరిందని భాగ్యం, ఆనంద్ రావు తెగ నటించేస్తారు.

మా అమ్మడు మా ఇంట్లోనే ఉంటే మాకు తిండి పెట్టడం కోసం కాఫీ కప్పులు కడగడం, ఇంట్లో చాకిరి చేస్తుంది. మీ నాన్నకు నామూషీ అనుకుంటే మీ భార్యను మీ ఇంటికి తీసుకెళ్లు బాబు అని చందును భాగ్యం అడుగుతుంది. అప్పుడే క్లాప్స్ కొడుతూ ధీరజ్, నర్మద వస్తారు. ఒక్క నిమిషం మీ పర్ఫార్మెన్స్ దెబ్బకు కళ్లలో నీళ్లు వచ్చేశాయని నర్మద అంటుంది.

విడాకులు ఇప్పిద్దామని

వల్లి వదినకు, అన్నయ్యకు విడాకులు ఇప్పించేద్దాం. భరణం కింద నెలకు రూ.40 వేలు ఇప్పిద్దామని ధీరజ్ అంటాడు. నన్ను, మా ఆయనను విడగొట్టాలని చూస్తున్నారా అని వల్లి అంటుంది. అమ్మ స్థానంలో ఉండాల్సిన నువ్వు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావని ధీరజ్ ప్రశ్నిస్తాడు. మీ కన్నీళ్లు నిజమనుకుని ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నా, కానీ మీరు జన్మలో మారరని చందు చీ కొట్టి వెళ్లిపోతాడు.

లారీ డ్రైవర్ ఎంట్రీ

లారీ డ్రైవర్ అక్కడికి వస్తాడు. నర్మద అతణ్ని చూస్తుంది. అది చూసి వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కంగారు పడతారు. డ్రైవర్ పారిపోతుంటే ధీరజ్, నర్మద వెనకపడతారు. ఆ డ్రైవర్ వాళ్లకు దొరికాడంటే మన బతుకులు నలిగిపోతాయని భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ అంటాడు.

లారీ డ్రైవర్ ను ధీరజ్, నర్మద పట్టుకుంటారు. ఎందుకు యాక్సిడెంట్ చేశావని కొడుతూ ధీరజ్ అడుగుతాడు. తనకేం తెలియదని హిందీలో ఆ డ్రైవర్ మాట్లాడతాడు. చంపేస్తానని ధీరజ్ బెదిరించడంతో నిజం చెప్తానని డ్రైవర్ అంటాడు. ఇక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More