Sign in

Saturn Rise: 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని ఉదయిస్తాడు.. ఈ రాశులకు అదృష్టం ప్రకాశిస్తుంది!

మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఇస్తే కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోక తప్పదు. శని జ్యోతిష్య శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని ఉదయం, ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం.

Published on: Feb 4, 2026, 08:00:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శని సంచారం: గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు జరిగితే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురవుతాయి, మరి కొన్ని సార్లు సమస్యలను ఎదుర్కోక తప్పదు. శని న్యాయ దేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోక తప్పదు. శని జ్యోతిష్య శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

Saturn Rise: 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని ఉదయిస్తాడు
Saturn Rise: 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని ఉదయిస్తాడు

శని కేవలం రాశి లేదా నక్షత్రంలోనే కాదు, ఎప్పటికప్పుడు ఉదయించడం, అస్తమించడం కూడా చేస్తాడు. శని కదలిక మారినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి.

శని సంచారం

మీన రాశిలో శని సంచారం జరుగుతోంది. 2026లో శని ఉదయిస్తాడు. శని తన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఈ సంచారం మేష రాశి నుంచి మీన రాశి వరకు కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. శని ఉదయంతో కొన్ని రాశుల వారి అదృష్టం కూడా ప్రకాశించబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శని ఉదయం, ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం

1.మిథున రాశి:

మిథున రాశి వారికి శని ఉదయించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి పదవ ఇంట్లో శని ఉదయిస్తాడు. ఇది మిథున రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. కొంతమంది పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది. బాస్‌లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.

పరిహారం: ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపారాధన చేయండి.

2.తులా రాశి:

తులా రాశి వారికి శని సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి ఆరో ఇంట్లో శని ఉదయిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది అద్భుతమైన సమయం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పుల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. శత్రువులు మీ ముందు ఓడిపోతారు.

పరిహారం: శనివారం పక్షులకు ముఖ్యంగా కాకులకు, ఆహారం పెడితే మరింత శుభ ఫలితాన్ని పొందవచ్చు.

3.మకర రాశి:

మకర రాశి వారికి శని ఉదయం లాభదాయకంగా ఉంటుంది. మకర రాశికి అధిపతి శని. అటువంటి పరిస్థితుల్లో శని ఉదయంతో కొన్ని లాభాలను పొందుతారు. ఈ రాశి మూడవ ఇంట్లో శని ఉదయిస్తాడు. ఏ పని చేసినా సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. ధైర్యం కూడా పెరుగుతుంది.

పరిహారం: ఈ రాశి వారు నల్ల మినపప్పును దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More