Ugadi 2026: ఉగాది పండుగను సాంప్రదాయ బద్ధంగా ఎలా చేసుకోవాలి? ఆచరించాల్సినవి, పచ్చడి మంత్రం, పఠించాల్సిన మంత్రాలు ఇవిగో

ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.  

Published on: Mar 13, 2026 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త సంవత్సరం ఉగాది (Ugadi 2026) నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.

ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు (pinterest)
ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు (pinterest)

ఇంత విశేషమైన రోజున ఖచ్చితంగా కొన్ని మంత్రాలు చదివేటట్టు చూసుకోండి. ఈ మంత్రాలను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని శుభకార్యాలను మొదలుపెట్టడం వలన ఏడాది మొత్తం సానుకూల మార్పులను చూస్తారు. ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు, ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు

ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం మంచిదని మనకు తెలిసిందే. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను అందరూ వింటారు. అలాగే దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. దాంతో పాటు ఈ మంత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏడాది అంతా సానుకూల మార్పులను చూడొచ్చు.

సూర్య మంత్రం:

“ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని ఉగాది నాడు తప్పక పఠించండి. ఈ మంత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం, తేజస్సు, విజయాలు లభిస్తాయి. సూర్యుడు శక్తికి ప్రతీక అని చెప్పచ్చు.

లక్ష్మీ మంత్రం:

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః”

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును తీసుకొస్తుంది. ఈ మంత్రాన్ని రోజూ చదవడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

విష్ణువు మంత్రం:

“ఓం నమో భగవతే వాసుదేవాయ”.

ఈ మంత్రాన్ని జపిస్తే అనేక మార్పులు కలుగుతాయి; సానుకూల మార్పులను చూడొచ్చు. విష్ణువు కాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా జపించేటట్టు చూసుకోండి.

ఉగాది పచ్చడి మంత్రం:

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదువుకోవాలి. ఈ మంత్రాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవడం వలన మంచి ఫలితం కూడా చూడొచ్చు.

ఉగాది నాడు ఆచరించాల్సినవి

ఉగాది నాడు పైన చెప్పిన మంత్రాలు చదువుకోవడంతో పాటు ఈ పద్ధతులను కూడా పాటించేటట్టు చూసుకోండి. ఇవి కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి.

ఉగాది పచ్చడి: ఉగాది నాడు ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది జీవితంలోని షడ్రుచులను సూచిస్తూ ఒక సందేశాన్ని అందిస్తుంది.

కొత్త బట్టలు ధరించడం: ఈరోజు కొత్త బట్టలు ధరించడం శుభసూచికంగా చెబుతారు.

దానధర్మాలు: ఉగాది నాడు తోచినంత దానధర్మాలు చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఎంతో మంచి ఫలితాన్ని చూడొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి.

ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం: ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఏడాది అంతా దైవానుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం: ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. మామిడి తోరణాలు కట్టి ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది; ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ఉగాదిని ఎలా జరుపుకోవాలి?

  • సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. గుమ్మాలకు మామిడి ఆకులను కట్టి అందంగా అలంకరించాలి.
  • ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు, కుంకుమలు అద్దాలి. దీంతో మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.
  • ఇష్టదైవాన్ని మనసారా ఆరాధించి, ఆ తర్వాత పిండి వంటలతో నైవేద్యం పెట్టి కుటుంబ సమేతంగా స్వీకరించాలి.
  • కచ్చితంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
  • సాయంత్రం పంచాంగ శ్రవణం వినాలి.
  • ఉగాది నాడు ఆనందంగా ఉంటే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More