Kareena Kapoor In White Bikini: వైట్ బికినీలో కరీనా కపూర్ హాట్ లుక్స్.. నో మేకప్, గ్రీస్ వెకేషన్ ఫొటోలు వైరల్!
Kareena Kapoor In White Bikini Photos Viral: బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రస్తుతం గ్రీస్ దేశంలో ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏజియన్ సముద్రంలో వైట్ బికినీలో కరీనా దిగిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Kareena Kapoor In White Bikini Photos Viral: బాలీవుడ్ బేబో కరీనా కపూర్ స్టైల్ ఐకాన్‌గా ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో కలిసి విదేశీ వెకేషన్లకు వెళ్లడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రస్తుతం భర్త సైఫ్ అలీ ఖాన్, పిల్లలతో కలిసి యూరప్‌లోని అందమైన దేశం గ్రీస్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు కరీనా కపూర్.

ఏజియన్ సముద్రంలో కరీనా జలకాలాలు
దీనికి సంబంధించిన ఫోటోలను కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా షేర్ చేస్తూ అభిమానులకు వెకేషన్ గోల్స్ ఇస్తున్నారు. తాజాగా కరీనా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రీస్ పరిసరాల్లోని ప్రసిద్ధ ఏజియన్ సముద్రం (Aegean Sea)లో ఆమె స్విమ్ చేస్తూ కనిపించారు.
ఒక ప్రైవేట్ యాచ్ (లగ్జరీ పడవ) పై నుంచి నీలి రంగు సముద్రపు నీటిలో వైట్ బికినీ ధరించి కరీనా కపూర్ దిగిన ఫోటోలు ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. "కేవలం నేను, ఏజియన్ సముద్రం మాత్రమే" అని ఈ ఫోటోలకు కరీనా క్యాప్షన్ ఇచ్చారు.
'హాట్ హస్బెండ్' అంటూ సైఫ్ ఫోటోలు
ఈ స్టార్ జంట తమ వెకేషన్ లొకేషన్‌ను అధికారికంగా ప్రకటించనప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న క్రిస్టల్ బ్లూ వాటర్, విజువల్స్ చూస్తే వారు గ్రీస్‌లోనే విహరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ టూర్‌లో కరీనా కేవలం తన ఫోటోలనే కాకుండా, భర్త సైఫ్ అలీ ఖాన్ సముద్రంలో ఈత కొట్టి వస్తున్న పిక్‌ను కూడా షేర్ చేశారు. ఒడ్డున కూర్చుని సైఫ్ ఫోటోను క్లిక్ చేసిన కరీనా..
"సమ్మర్ చాలా బాగా సాగుతోంది #HotHusband," అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ పెట్టారు. మరో పోస్ట్‌లో కరీనా ఎలాంటి మేకప్ లేకుండా సహజమైన నో-మేకప్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. స్విమ్‌వేర్‌పై బ్లూ లైన్స్ షర్ట్, తలపై ఒక స్టైలిష్ బండానా (స్కార్ఫ్) కట్టుకుని దిగిన సెల్ఫీలను పంచుకుంటూ.. ఈ బండానా తనకు ఎంతో నచ్చిందని రాసుకొచ్చారు.
తషన్ సెట్స్‌లో మొదలైన 'సైఫీనా' ప్రేమకథ
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ బాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరి మధ్య పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, అది వీరి బంధానికి ఎప్పుడూ అడ్డు రాలేదు. 2008లో వచ్చిన 'తషన్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఆ ఏడాదిలోనే సైఫ్ తన చేతిపై కరీనా పేరును టాటూగా వేయించుకుని తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట, అక్టోబర్ 16, 2012న అత్యంత ఆప్తుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జెహ్) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
సినిమాల విషయానికి వస్తే..
కరీనా కపూర్ కెరీర్ పరంగానూ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ కాప్ డ్రామా 'సింగం అగైన్' లో ఆమె అజయ్ దేవగన్ భార్యగా కీలక పాత్రలో మెరిశారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లతో కూడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.


పృథ్వీరాజ్ సుకుమారన్‌తో
అంతకుముందు ఆమె నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. ప్రస్తుతం కరీనా, టాలెంటెడ్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న 'దాయిరా' (Daayra) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


