త్వరలో గరుడ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పేద బ్రహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు.
రూ. 10 వేల ఆర్థిక సాయం…

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాంప్రసాద్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. గరుడు పథకం కింద నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే రూ.10 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థికసాయంతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్టసమయంలో ఉపశమనం లభిస్తుందన్నారు.
బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలనకు 2014లోనే సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను అమలు చేస్తూ, బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు కృషి చేశారన్నారు. 2014-19లో భారతి, భారతీ విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి పది పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆదాయం లేని ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకాన్ని 2014-19లో సీఎం చంద్రబాబు అమలు చేశారని గుర్తుచేశారు. అప్పట్లో అర్చకులకు రూ.3 వేల గౌరవ వేతనంతోపాటు ధూప దీపాల కోసం మరో రూ.2 వేలు ఇచ్చేవారన్నారు.
మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అర్చకుల గౌరవ వేతనం రూ.7వేలకు, ధూప దీపాల కోసం రూ.3 వేలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో దేవస్థానాల్లో పనిచేసే అర్చకులకు గౌరవ భృతిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. నిరుద్యోగ వేడపండితులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని సంభావన పేరుతో అందజేస్తున్నామన్నారు.
{{/usCountry}}మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అర్చకుల గౌరవ వేతనం రూ.7వేలకు, ధూప దీపాల కోసం రూ.3 వేలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో దేవస్థానాల్లో పనిచేసే అర్చకులకు గౌరవ భృతిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. నిరుద్యోగ వేడపండితులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని సంభావన పేరుతో అందజేస్తున్నామన్నారు.
{{/usCountry}}