...
...
Next Story

బాపట్లలో కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే తెలంగాణలోనూ జరిగింది. తాజాగా బాపట్లలోనూ ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందారు.

Published on: Nov 3, 2025, 12:32:24 IST
Advertisement

ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం మరవకముందే ఏపీలో మరికొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా బాపట్ల జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారు, లారీ ఢీ కొట్టాయి. దీంతో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర ప్రమాద జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు, లారీ బలంగా ఢీ కొట్టాయి. కారులో ఉన్న నలుగురు మరణించారు. మృతులను కర్లపాలెం చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఇందులో ఇద్దరు బాలురు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ బస్సు ప్రమాదం

తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 70 మందితో ప్రయాణిస్తున్న బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో కంకర మెుత్తం బస్సులో పడింది. 19 మంది ఈ ఘటనలో చనిపోయారు. మిగిలినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అతివేగంతో రావడం, గుంత ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. జేసీబీలు తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు.

చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో ప్రయాణికులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe