మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో… వైఎస్ జగన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు పేర్కొన్నారు.
వైఎస్ జగన్ కు విషెస్…

'వైఎస్ జగన్ గారూ జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
“మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
c
{{/usCountry}}c
{{/usCountry}}Birthday greetings to former Chief Minister YS Jagan Mohan Reddy. Wishing him good health and a long life.
@ysjagan
“YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా” అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు.
మరోవైపు జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. రకరకాల పోస్టులతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.